మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు

విజయవాడ, మార్చి 7, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు పోయిన వాళ్లంతా జగన్‌ను నిలదీయలంటున్నారు చంద్రబాబు. ఓట్లను తానే తొలగించినట్లు జగన్ ఒప్పుకున్నాడని.. బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ - 7 కుట్రలు జరిగాయని స్పష్టమైందన్నారు. టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండి.. వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డేటా చోరీ, ఓట్ల తొలగింపు వ్యహారంపై చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందించారు. అలాగే టెలీకాన్ఫరెన్స్‌లో నేతలతో చర్చించారు. చంద్రబాబు తన ట్వీట్‌లో ‘తెలుగుదేశం అంటేనే ఉత్సాహం, ఉత్సాహం అంటేనే తెలుగుదేశం. రేపటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలి.. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి ఓ కొలిక్కి వచ్చి సంక్షేమం కొనసాగుతుంది. ఏమరుపాటుగా ఉంటే రాష్ట్రం దొంగలపాలవుతుంది. 2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రదిష్ట వచ్చింది, ఆ ఐదేళ్లలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశాం. కానీ కొందరు బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. 



మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు

వారిని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు’అన్నారు. ‘ఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు జగన్‌ . ఫారమ్-7 దుర్వినియోగం చేశామని అతనే ఒప్పుకున్నాడు. దీంతో బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ - 7 కుట్రలు జరిగాయని స్పష్టమైంది. కాబట్టి ఓట్లు పోయిన వాళ్లంతా జగన్‌ను నిలయదీయండి. ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోండి’అన్నారు. తెలుగుదేశం అంటేనే ఉత్సాహం, ఉత్సాహం అంటేనే తెలుగుదేశం. రేపటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలి, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి ఓ కొలిక్కి వచ్చి సంక్షేమం కొనసాగుతుంది. ఏమరుపాటుగా ఉంటే రాష్ట్రం దొంగలపాలవుతుంది.గురువారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్రంలో 59లక్షల ఓట్ల తొలగించడానికి సూత్రదారి జగనేనని ఆరోపించారు. ఫారమ్ 7 దుర్వినియోగం చేశానని జగన్ ఒప్పుకున్నారని.. ఈ కుట్రలపై వేగంగా స్పందించి అడ్డుకున్నామన్నారు. పార్టీలన్నిటికి యాప్‌లు ఉన్నాయి.. టీఆర్ఎస్ మిషన్ యాప్, బీజేపీ యాప్, వైసీపీ యాప్‌లు ఉన్నాయని గుర్తు చేశారు. కాని టీడీపీ యాప్ పైనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోదీ, కేసీఆర్ అండతో జగన్ రెచ్చిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఓట్ల తొలగింపు కుట్రల వెనుక మూడు పార్టీల హస్తం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని.. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ భరించలేకపోతున్నాయని సీఎం విమర్శించారు. టీడీపీ డేటా దొంగిలించి.. తమకే ఓట్లు వేయాలని వైసీపీ టీడీపీకి ఫోన్లు చేయిస్తోందన్నారు చంద్రబాబు. వైసీపీ నుంచి ఫోన్లు చేసేవారిని టీడీపీ కార్యకర్తలు నిలదీయాలన్నారు. జగన్‌ కుట్ర ఏపీలో చెల్లదన్నారు.