తెరాసలో చేరిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజాల సురేందర్

కామారెడ్డి  మార్చి 29(way2newstv.com):
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సురేందర్,  తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  తారక రామారావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. తెలంగాణ పార్టీ ఆవిర్భవించినప్పుడు తెరాస జెండాలు మోసిన ఆయన పలు కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు 


తెరాసలో చేరిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 35 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా తెరాస అభ్యర్థి రవీందర్ రెడ్డి పై గెలుపొందారు, : కే టి ఆర్  కు ఉన్న సన్నిహితం వలన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో , ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెరాస పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే సురేందర్ తెలిపారు.
Previous Post Next Post