ఏలూరు, మార్చి 22, (way2newstv.com)
రాష్ట్రంలో పాలన మారాలంటే పవన్‌కళ్యాణ్ సీఎం కావాలని అంటున్నారు ఆయన అభిమానులు. భీమవరం నుంచి పోటీ చేస్తున్న పవన్‌కళ్యాణ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పవన్‌కు మద్దతుగా ఆయన అభిమానులు, జనసైనికులు, యువత పెద్దసంఖ్యలో భీమవరంలో ర్యాలీ చేపట్టారు. పవన్ సీఎం అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్ మారుతుందని అంటున్నారు.
పవన్ పోటీపై ఫ్యాన్స్ లో ఆనందాలు
పవన్ కళ్యాణ్‌కు ఓటేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు చెబుతున్నారు. పవన్ మీద అభిమానంతోనే ఆయనకు మద్దతుగా వచ్చాయని అంటున్నారు. ఇక నుంచి భీమవరం నియోజకవర్గం జనసేనకు అడ్డాగా మారబోతోందని చెబుతున్నారు. జనసేన మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని జన సైనికులు తెలిపారు.