పిఠాపురం, మార్చి 26 (way2newstv.com)
పిఠాపురం నియోజకవర్గంలోని టిడిపి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రతిపక్షపార్టీ అయిన వైయస్సార్సీపి పార్టీలో వలసలు వేగవంత మయ్యాయి. మండలంలోని నరసింగపురం గ్రామానికి చెందిన ఎస్సీ, బిసి, ఓసి, సామాజిక వర్గాలకు చెందిన సుమారు 200 టిడిపి ఓటర్లు నరసింగపురం గ్రామ మాజీ సర్పంచులు ఓలేటి పాపిరెడ్డి, రాయుడు వెంకయమ్మల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్ధి పెండెం దొరబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
వైయస్సార్సీపి లో భారీ చేరికలు...టిడిపిలో చీలికలు
ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి సేవలందిచిన నాయకులు మానుకొండ మాలిబాబు, రాయుడు వెంకటసుబ్బారావు, కాశీపు శ్రీను, గంటా చిన్నా, గంటా సత్తిబాబు, మాలమహానాడు నాయకులు, న్యాయవాది కొమ్ము నూకరాజు, మాతా బాబులు, వాసా నిర్మల, ముంజరపు అర్జునుడు, ఎంబల ఏసురత్నం, కూళ్ల మరియమ్మ తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నవారిలో ఉన్నారు. ఈ సంధర్భంగా వారు "వారధి"తో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరిత కుట్రలతో ప్రజలకు అన్యాయం చేసిందని, మరోక్కసారి మాకు మోసపోవడం ఇష్టంలేక పార్టీతీర్ధం పుచ్చుకోవడం జరిగిందన్నారు.