భారత్‌ ప్రయోగం విషయం ముందే తెలుసు

మేము గూఢచర్యం చేయలేదు: అమెరికా
ముంబయి మార్చ్ 30  (way2newstv.com)
భారత్‌ యాంటీ శాటిలైట్‌ ప్రయోగం నిర్వహించినప్పుడు అమెరికాకు ఎటువంటి గూఢచర్యం నిర్వహించలేదని పెంటగాన్‌ పేర్కొంది. ఈ ప్రయోగం తర్వాత డిగోగార్సియా స్థావరం నుంచి అమెరికా విమానం ఒకటి బంగాళఖాతంలోకి ప్రవేశించింది. దీనిపై పెంటగాన్‌ వివరణ ఇస్తూ భారత్‌ ప్రయోగం విషయం ముందే తెలుసని పేర్కొంది. ‘‘అమెరికాకు చెందిన ఏ పరికరాలు భారత్‌పై నిఘా వేయలేదు. 


భారత్‌ ప్రయోగం విషయం ముందే తెలుసు

వాస్తవానికి అమెరికా భారత్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. భారత్‌తో సైనిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం. ’’ అని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి  లెఫ్టినెంట్‌ కల్నల్‌ డేవిడ్‌ డబ్ల్యూ ఈస్ట్‌బార్న్‌ వెల్లడించారు.  అమెరికా విమానం భారత్‌పై నిఘా వేసిందని వచ్చే వార్తలతో ఇరు దేశాల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Previous Post Next Post