ఓట్లు తొలగించడానికి స్కెచ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓట్లు తొలగించడానికి స్కెచ్

అమరావతి, మార్చి 5, (way2newstv.com )
తెలంగాణ తరహాలోనే ఏపీ లో కూడా కేసీఆర్, జగన్ తో కలిసి ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు. గంప గుత్తగా ఓట్లు తొలగించడానికి 175 నియోజకవర్గాల్లో పెద్ద స్కెచ్ వేశారు. ఈ కుంభకోణంలో వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి సంబంధించిన ఓట్ల తొలగింపు పై నాతో సహా ఎమ్మెల్యేలు ఈసీ ని ఫిర్యాదు చేశాం. టీడీపీ కి సంబంధించిన 8 లక్షల ఓట్లు తోలగించేందుకు కుట్ర చేశారు. ఐటీ గ్రిడ్ కంపెనీ వద్ద ఏపీ ఓటర్ల లిస్ట్ మొత్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాడులు చేయడం ఏంటి?...వైసీపీ వాళ్లు ఫిర్యాదు చేయగానే దాడులు చేశారుని అయన విమర్శించారు.


ఓట్లు తొలగించడానికి స్కెచ్ 

దీని వెనుక కుట్ర ఉంది..మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రకి స్కెచ్ వేశారు. ఈ కుట్రలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర ఉంది. తెలంగాణ పోలీసులు చెబుతుంది వాస్తమే అయితే...చట్ట ప్రకారం ..ఆ కేసును ఏపీకి ఇవ్వాలి.. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఈ విషయం ఉందని అయన అన్నారు. దీర్ఘకాలికిమైన కుట్రతో ఇదంతా చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు..అరెస్టులు చూపించడం లేదు. హేబీయస్ కార్పెస్ పిటిషన్ కొట్టేయడం అంటే... తప్పు చేసినట్టు కాదు. కేసీఆర్ మీద ఏపీ లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే..వెంటనే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది మిగతా రాష్ట్రాలు కూడా చేస్తే..మీ పరిస్థితి ఏంటని అయన అడిగారు. ఐటీ కంపెనీ లో దాడులు చేసి హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుని ..దాన్లో ఉన్న సమాచారాన్ని వేరే పార్టీల వారికి ఎలా ఇస్తారు. ఇది పోలీసులు చేస్తున్న కుట్ర కాదా అని అన్నారు. పోలీసులు టీఆర్ఎస్ నాయకుల కంటే ఎక్కువ పని చేస్తున్నారని అయన అన్నారు.