కర్నూలు, మార్చి,౩౦(way2newstv.com):
ఎన్నికల పోలింగ్ లో పాల్గొనే సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేసి ఓటు హక్కు వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేటు నుండి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడేతూ ఆదివారం ప్రిసైడింగు అధికారులు, సహయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించే రెండవ దఫా శిక్షణా కార్యక్రమంలో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అందరికీ బ్యాలెట్ పత్రాలు పంపిణి చేయాలని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి
బ్యాలెటు పత్రలు వినియోగించే సిబ్బంది 13 ఎ, బి, సి ఫారాల్లో ఓటు హక్కు వినియోగించుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పోస్టల్ ఓటర్ల జాబితా మార్క్ డ్ కాపీలో సంబంధధిత సిబ్బంది స్థానంలో టిక్ పెట్టుకోవాలన్నారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులందరూ పోల్ మెనేజ్ మెంటు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారి పోలింగ్ సిబ్బంది శిక్షణను గుంపులు గుంపులుగా కాకుండా బ్యాచ్ ల వారీగా పరిపూర్ణ శిక్షణను అందించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి తన పిడి డైరీని వ్రాసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇందుకోసం ఎన్ ఎన్ ఎస్ వాలెంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారి ఫోన్, ఫ్యాక్స్ నెంబర్ జిల్లా కేంద్రానికి తక్షణమే పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పఠాన్ శెట్టి రవి సుభాష్, నగర పాలక సంస్ధ కమీషనరు ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.