విజయవాడ మార్చి 19 (way2newstv.com):
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక స్థానాల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా పార్టీ జనరల్ బాడీ ఆయనను కోరింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందో తెలుసు కోవడానికి జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపించింది , అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం స్థానాలు అగ్రస్థానంలో నిలిచాయి.
భీమవరం, గాజువాకలనుంచి పవన్ కళ్యాణ్ పోటీ
ఈ ఎనిమిది స్థానాలపై అంతర్గత సర్వే జరిపించిన పార్టీ ఆధిష్టానం భీమవరం, గాజువక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ ను కోరింది. దీనికి ఆమెదం తెలిపిన పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువక స్థానాల నుంచి పోటీచేయాలని నిశ్చయించుకున్నారు.