అబ్కారీ, మధ్యనిషేధ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా
అనాధలు, అంధులకు ఉపకరించేలా ఉపకరణాల పంపిణీ
విజయవాడ మార్చ్ 1 (way2newstv.com)
కేవలం కార్పొరేట్ సంస్ధలే కాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించవలసి ఉంటుందని రాష్ట్ర మధ్య నిషేదము, అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధము, అబ్కారీ శాఖ గెజిటెడ్ అఫీసర్ల సంఘం - 2019 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం విజయవాడ ప్రసాదంపాడులోని ఎక్సైజ్ కమీషనరేట్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ప్రతి ఉద్యోగ సంఘం సామాజిక దృక్పధంతో వ్యవహరించాలని ఆక్రమంలో ఇతరులకు ఆదర్శంగా ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నేతలు అభినందనీయిలన్నారు.
ఒకింత ఆలస్యం అయినప్పటికీ పూర్తి సమాచారంతో డైరీ రూపొందించారని, ఇది తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. తాను కూడా ఇకపై ఇదే అంశాన్ని అమలు చేస్తానని, సామాఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధము, అబ్కారీ గెజిటెడ్ అఫీసర్ల సంఘం తమ డైరీ ఆవిష్కరణ సందర్భంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 40 మంది అనాధలకు రెండు నెలలకు సరిపడా అన్ని రకాల వస్తువులను ఈ సందర్భంగా అసోసియేషన్ అందచేయటం ప్రత్యేకత. మరోవైపు పది మంది అంధులకు ప్రత్యేకంగా రూపొందించిన గడియారాలను అందించారు. వీటి ద్వారా వారు చూడలేనప్పటికీ సమయాన్ని తెలుసుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధము, అబ్కారీ గెజిటెడ్ అఫీసర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైవి భాస్కరరావు మాట్లాడుతూ అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగిన కమీషనర్ మళ్లి తమకు రావటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తాము పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ హరికుమార్, అదనపు కమీషనర్ కెఎల్ భాస్కర్ , జాయింట్ కమీషనర్ చంద్రశేఖర్ నాయిడు, దేవకుమర్, జోసఫ్, ఓఎస్డి నాగేశ్వరరావు, అసోసియేషన్ నేతలు ప్రభుకుమార్, అదిశేషు, కుమరేషన్, శ్రీనివాసులు, ఉద్యోగ సంఘాల నేతలు నరశింహులు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Andrapradeshnews