కాకినాడ, మార్చి,౩౦(way2newstv.com):
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ద్వజస్దంభం విరిగిపడి మహిళ మృతిచెందింది. ముమ్మిడివరం నగరపంచాయితీ ఆఫీసు ప్రక్కన గల ఆభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నూతనంగా ఏకశిలా ద్వజస్దంభం ఏర్పాటుకు భక్తులు సన్నాహాలు చేసారు.
కూలిన ద్వజస్దంభం…మహిళ మృతి
రెండు పెద్ద క్రేనులను రప్పించి ద్వజస్దంభాన్ని నిలుపుతుండగా దురదృష్టవశాత్తు ఆ స్దంభం విరిగిపోయింది. ఈ ఘటనలో స్దానిక మహిళ గుడిపూడి వరలక్ష్మి(50) మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు. గతంలో పెధాయ్ తుఫాను సమయంలో వీచిన పెనుగాలులకు పాత ద్వజస్దంభం కూలిపోగా భక్తుల సహకారంతో శనివారం ఏకశిలా ద్వజస్దంభాన్ని ప్రతిష్ఠిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.