శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ, మార్చి 27, (way2newstv.com)
ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సాధించిన మరో ఘనతను ఇండియా కూడా సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం అయన జాతినుద్దేశించి ప్రసంగించారు. 'మిషన్ శక్తి' విజయవంతం అయ్యిందని ప్రకటించారు. అంతరిక్ష రంగంలో భారత్ సత్తా చాటిందని.. భారత్ స్పేస్ పవర్గా అవతరించిందని.. ప్రపంచంలో స్పేస్ పవర్గా మారిన నాల్గో దేశం ఇండియానే అని స్పష్టం చేశారు. అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను కూల్చివేశామని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని, ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు.
మిషన్ శక్తి విజయవంతం
లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశామని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, 'మిషన్ శక్తి' పేరిట ఇది జరిగిందని అన్నారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్ అని.. ఈ మిషన్ను మూడు నిమిషాల్లో పూర్తిచేశారు. దీనిని అత్యంత విజయవంతంగా పూర్తిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇకపై ఇండియా ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. అయితే, మన సామర్ధ్యం ఎవరికీ వ్యతిరేకంగా ఉపయోగించబడదని అంతర్జాతీయ సమాజంకు నేను హామీ ఇస్తున్నానని ప్రధని పేర్కోన్నారు. ఇది భద్రత కోసం పూర్తిగా భారతదేశం యొక్క రక్షణ కోసమే అన్నారు.