ఆ నలుగురు ఎవరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆ నలుగురు ఎవరు

కాకినాడ, మార్చి 6, (way2newstv.com)
తూర్పు గోదావ‌రి జిల్లా ప‌రిధిలో ఉన్న అమ‌లాపురం, గ‌న్న‌వ‌రం, రాజోలు, రంప‌చోడ‌వ‌రం రిజ‌ర్వ్‌డ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ టికెట్ల‌పై ఇంకా స‌స్పెన్స్ వీడ‌టం లేదు. అభ్య‌ర్థిత్వాల కోసం ఆశావ‌హులు మిక్కిలి సంఖ్య‌లో పోటీ ప‌డుతుండ‌గా…సిట్టింగ్‌లు ప‌ట్టు విడ‌వ‌కుండా త‌మ‌కే కావాలంటూ గ‌ట్టిగా ఉన్నారు. ఎన్నిక‌లు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ.. స‌ద‌రు టికెట్ల విష‌యంలో పార్టీ రాజ‌కీయం రంజుగా మారుతోంది. ఆశావ‌హులు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసం పార్టీలోని మంత్రులు..అగ్ర‌నాయ‌క‌త్వానికి చెందిన కొంత‌మంది పెద్ద‌లు చ‌క్రం తిప్పి మ‌నోడు అనిపించుకునేందుకు వ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.అమలాపురం, గన్నవరం, రాజోలు అసెంబ్లీ స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా టీడీపీ అధిష్ఠానం మార్పు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అమలాపురం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు తిరిగి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ఒక వర్గం పట్టుబడుతుండ‌గా, మరోవర్గం ఆ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 


 ఆ నలుగురు ఎవరు

ఆనందరావుకు మ‌ద్ద‌తుగా ఆయ‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని దివంగత నేత మాజీ మంత్రి డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు వర్గీయులు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వర్గానికి చెందిన కొందరు మాత్రం ఆనంద‌రావుకు టికెటిస్తే ఆయ‌న గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు.ఆనంద‌రావుతో పాటు ఇక్క‌డి నుంచి మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, న్యాయవాది సాధనాల శ్రీనివాస్ అభ్య‌ర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నియోజకవర్గంలోని దళిత నాయకులుగా పేరొందిన మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ బత్తుల సాయి, మరోనేత బొంతు బాలరాజు తదితరులు పార్టీ అధినేతను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాల్సిందిగా కోరినట్టు సమాచారం. అలాగే గన్నవరం నుంచి పోటీపడే వారిలో బలమైన అభ్యర్థులు లేకపోయినా సిటింగ్‌ ఎమ్మెల్యే నారాయణమూర్తి వయసురీత్యా తప్పుకోనున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, స్టాలిన్‌బాబుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒక వేళ అమలాపురం నుంచి ఆనందరావుని తప్పిస్తే గన్నవరం సీటు ఇవ్వాలని ఓ కీలకమంత్రి అధిష్ఠానానికి ప్రతిపాదించినట్టు సమాచారం.రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. 2009లో ఎంపీగా పోటీచేసిన గేదెల వరలక్ష్మి, బత్తుల రాము పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈనెల 5వ తేదీన జరిగే అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షలో నేత‌ల భ‌విత‌వ్యం తేల‌నుంది. అమలాపురం పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, కొత్తపేట అసెంబ్లీ స్థానాల్లో సిటింగ్‌లైన వేగుళ్ల జోగేశ్వరరావు, తోట త్రిమూర్తులు, దాట్ల బుచ్చిబాబులకు ఖరారుకాగా కొత్తపేట నుంచి బండారు సత్యానందరావుకు సీటు ఖరారైనట్టు సమాచారం. అమలాపురం పార్లమెంటు స్థానం దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్‌కి దాదాపు ఖరారైనట్టే.అరకు పార్లమెంటు పరిధిలోకి వచ్చే రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో ముగ్గురి మధ్య ప్రముఖంగా పోటీ నడుస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తన ప్రయత్నాలు ముమ్మరం చేసుకోగా, ఉపాధ్యాయ యూనియన్‌ నాయకుడు బొగ్గుల కాటమరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిన్నం బాబూరమేష్‌, శీతంశెట్టి వెంకటేశ్వరరావులు కూడా ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ విష‌యంలో అరకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కిషోర్‌ చంద్రదేవ్‌ సిఫారసులకు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.