రంజీత్ రెడ్డిని గెలిపిస్తాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రంజీత్ రెడ్డిని గెలిపిస్తాం

హైదరాబాద్, మార్చి 22  (way2newstv.com
చేవెళ్ల  పార్లమెంట్ స్థానానికి తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డాక్టర్ రంజీత్ రెడ్డి శుక్రవారం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి,  , ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, యాదయ్య, మహేష్ రెడ్డి, పార్లమెంట్ ఇంఛార్జి గట్టు రామచంద్రరావు లను మర్యాద పూర్వకంగా కలిసారు. ఎన్నికల్లో తసక సహకారం అందించాలని కోరారు. తరువాత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడతూ డాక్టర్ రంజీత్ రెడ్డి మొదటినుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేశారు. రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ వ్యాపార సంస్థలు ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటారు.అయనను గెలిపించే బాధ్యత నాది,  మా ఎమ్మెల్యేలదని అన్నారు.  డాక్టర్  రంజిత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్లపార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కెసిఆర్ గారి కి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 


రంజీత్ రెడ్డిని గెలిపిస్తాం

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి కృతజ్ఞతలని అన్నారు.  నాకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి మహేందర్ , , నియోజకవర్గ ఎమ్మెల్యే అందరికీ ధన్యవాదములని అన్నారు. నాపై పెట్టిన  నమ్మకం వమ్ము చేయకుండా పనిచేస్తా.  చేవెళ్ల ప్రజలకు అండదండగా  తోడు నీడగా ఉంటాను. కంటికి రెప్పలా చూసుకుంటాను.  చేవెళ్ల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని వాగ్దానం చేస్తున్నానని అన్నారు.  వేరే వ్యాపకం లేదు ప్రజాసేవ చేయడానికే వచ్చానని అన్నారు.  ప్రజలు గెలిపించి పంపిస్తే పార్లమెంట్ లో చేవెళ్ల, తెలంగాణ ప్రజల గొంతుక అవుతా.   కేంద్రాన్ని యాచించే బదులు శాసిద్దం అంటున్నాం.  ఎర్రకోట మీద జెండా ఎగురవేయడం లో మన భాగస్వామ్యం ఉంటే నిధులు వాటంతట అవే వస్తాయి.  1110 జి ఓ విషయంలో ఇప్పటికే సీఎం, కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తాం. జీవో  ఎత్తివేయడం ఆలస్యం అయితే ఒక ఫండ్ కేటాయించి వారిని ఆదుకుంటామని అన్నారు.  చేవెళ్ళలో పోటీ చేసేది కొండ విశ్వేశ్వరెడ్డి మీదే నని అన్నారు.
ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ చేవెళ్లలో కాంగ్రెస్ ఊసే లేదు. పట్టుదలతో పనిచేస్తాం మంచి మెజారిటీతో  రంజిత్ ను గెలిపిస్తమని అన్నారు. మరో ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ విశ్వేశ్వర్  రెడ్డి రాజకీయ బిక్ష పెట్టిన  పార్టీ కి నమ్మక ద్రోహం చేశారు. రంజిత్ రెడ్డి రంగారెడ్డి కి చిరపరిచితుడు. శాయశక్తులా పనిచేస్తాం గేలిపిస్తామని అన్నారు.