ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి

కేసీఆర్వి ఊసరవెల్లి రాజకీయాలు
నరేంద్రమోదీ నమ్మక ద్రోహం చేశారు
పిడుగురాళ్ల, ఏప్రిల్ 9 (way2newstv.com)
ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఆయనవి ఊసరవెల్లి రాజకీయాలని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.మరో పక్క  ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని  విమర్శించారు. మంగళవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన రోడ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘ఆనాడు తిరుమలలో వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి మోదీ మోసం చేశారు. ఇక్కడున్న కోడికత్తి పార్టీ అన్నింటికీ అడ్డంకిగా మారింది. మోదీకీ, కేసీఆర్కు ఊడిగం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆనాడు గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుంటే, కొందరు భారతీయులు బ్రిటిషర్లకు సాయం చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తి లోటస్పాండ్ ఉంటూ కేసీఆర్ దగ్గరకు వెళ్లి, ఆయన కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటున్నాడు. అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లు ప్రజాహితం కోసం పనిచేశా. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి, రూ.1000 పింఛన్ను రూ.2వేలు చేశా. మళ్లీ గెలిస్తే, రూ3వేలు చేస్తా. 


 ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి

మీ పెద్ద కొడుకును గెలిపించుకునే బాధ్యత మీదే! అందరూ ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి రండి! ఎందుకంటే ఓట్ల దొంగలు ఉన్నారు.’’‘‘వైఎస్ఆర్సీపీ ఇచ్చే డబ్బులు పాపిస్టి డబ్బులు. నా చెల్లెమ్మలకు ఐదేళ్ల పాటు నేనే డబ్బులు ఇస్తా. ప్రపంచంలోనే మా డ్వాక్రా మహిళలను అత్యంత శక్తివంతులుగా తయారు చేస్తా. ఈ జన్మభూమిని కాపాడుకునే బాధ్యత మనపై ఉంది. జనాల్లో తెలుగుదేశం పట్ల ఆదరణ చూసి కోడికత్తి పార్టీ వణికిపోతోంది. రైతులకు అండగా ఉంటా. వ్యవసాయంలో 11శాతం వృద్ధి సాధించాం. దేశంలో రైతులకు అన్యాయం జరిగింది. నరేంద్రమోదీ రైతుల నడ్డి విరగొట్టారు. మరోపక్క కేసీఆర్ నోటికొచ్చినట్లు తిడుతున్నారు. 60 సంవత్సరాల ఆస్తి దోచుకుని, ఇప్పుడు  ఆంధ్రాకు వచ్చే నీళ్లును కూడా దోచుకోవాలనుకుంటున్నారు. ప్రత్యేకహోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్వి ఊసరవెల్లి రాజకీయాలు. తెలంగాణ ఇస్తే, కాంగ్రెస్లో విలీనం చేస్తానని అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత సోనియాగాంధీని రాక్షసి అన్నారు. నాగార్జునాసాగర్, శ్రీశైలంపై వాళ్లకు పెత్తనం ఇవ్వాలట. మోదీ, షా ఇద్దరూ దొంగలే.. వాళ్లకు తోడు కేసీఆర్ జగన్ తోడయ్యారు. అందుకే ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించి, వీళ్లకు బుద్ధి చెప్పాలి. మీరు ఓటు వేసిన తర్వాత తప్పనిసరిగా ఎవరికి ఓటు వేశారు చూసుకోండి’’ అంటూ ప్రజలకు సూచించారు.