2 వేలు తగ్గిన బంగారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

2 వేలు తగ్గిన బంగారం

ఏలూరు, ఏప్రిల్ 2 (way2newstv.com)
పసిడి ధర పెరిగింది. దేశీ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.85 పెరుగుదలతో రూ.32,820కు చేరింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. అయితే అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉండటంతో మన మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల పరిమితంగానే నమోదయ్యింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.20 క్షీణతతో రూ.38,580కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ నెమ్మదించడం ప్రతికూల ప్రభావం చూపింది. 


2 వేలు తగ్గిన బంగారం

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.22 శాతం తగ్గుదలతో 1,295.55 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 15.05 డాలర్లకు తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.85 పెరుగుదలతో రూ.32,820కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.85 పెరుగుదలతో రూ.32,650కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.కేజీ వెండి రూ.20 తగ్గుదలతో రూ.38,580కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.311 తగ్గుదలతో రూ.37,450కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది