హైదరాబాద్ ఏప్రిల్ 25(way2newstv.com)
ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరపాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
27న టీఆర్‌ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహిస్తారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.