5వేల మంది పోలీస్ బలగాలతో రెండంచల పహరా
స్ట్రాంగ్ రూమ్‌ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్
రాష్ట్ర అదనపు డిజి జితేందర్
హైదరాబాద్ ఏప్రిల్ 12 (way2newstv.com)
రాష్ట్ర వ్యాప్తంగా 38 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్ర పరిచిన ఇవిఎం, వివి ప్యాట్‌లను భద్రత కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు డిజి జితేందర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసన అనంతరం వాటిని భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించామని ఆయన వివరించారు.ఈక్రమంలో ఇవిఎం, వివి ప్యాట్‌ల పరిరక్షణ కోసం 5 వేల మంది కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయన్నారు.ఇవిఎం, వివి ప్యాట్‌లను భద్రత పరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 38 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ వద్ద రెడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరింగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 38 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవిఎంల భద్రత
రాష్ట్రంలో 33 జిల్లాల కేంద్రాల ఒక్కొక్కటి, హైదరాబాద్, రంగారెడ్డిలలో 14 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈక్రమంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 6 నుంచి 10 వరకు సిసి కెమెరాలను అమర్చామని, అలాగే ఒక్కో స్ట్రాంగ్ రూమ్ వద్ద 110 మంది కేంద్ర బలగాలు రక్షణగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా స్ట్రాం రూమ్‌ల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు.అనుమానితులు ఆయా ప్రాంతంలో సంచరించకుండా తగు జాగ్రత్తలు సైతం తీసుకోవడం జరిగిందని వివరించారు.స్ట్రాంగ్ రూమ్‌ల పరిసర ప్రాంతాలలో కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు సైతం గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. అయితే గురువారం 6 గంటల వరకు కొన్ని ప్రాంతాలలో పోలింగ్ జరగడంతో ఇవిఎం, వివి ప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లలోకి తరలించడం జరిగిందన్నారు.స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత విషయంలో అన్ని కోణాల్లో రక్షణ కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఇవిఎం, వివి ప్యాట్‌ల తరలింపులో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు శ్రమించాయన్నారు. వచ్చే నెల 23 ఫలితాలు వెలువడిన అనంతరం ఇవిఎం, వివి ప్యాట్‌లను తిరిగి ఇసి స్వాధీనం చేసుకునే వరకు కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు భద్రత కల్పిస్తాయని రాష్ట్ర అదనపు డిజి జితేందర్ వివరించారు.