హైద్రాబాద్, ఏప్రిల్ 2, (way2newstv.com)
నాగచైతన్య .. సమంత నాయకా నాయికలుగా నటించిన 'మజిలీ' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి యూ ఏ సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. దాంతో విడుదలకి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
5 న విడుదల కానున్న మజిలీ
సమంత .. చైతూ పెళ్లి తరువాత వస్తోన్న తొలి సినిమా కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఈ జంట కోరుకుంటోంది. ఈ కోరిక నెరవేర్చమని స్వామిని కోరుకోవడానికే సమంత తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ .. పెళ్లి .. ఆశయం అనే మూడు బలమైన కోణాల్లో ఈ సినిమా కథ కొనసాగుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి.