65.43 శాతం పోలింగ్ నమోదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

65.43 శాతం పోలింగ్ నమోదు

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి, ఏప్రిల్ 12 (way2newstv.com)              
 పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 65.43 శాతం పోలింగ్ నమోదు అయిందని  జిల్లా పాలనాధికారి మరియు పెద్దపల్లి పార్లమెంట్  రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన తెలిపారు.  గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం  అధికార  యంత్రాంగం  ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్లమెంట్ పరిధిలోని 7  అసెంబ్లీ సెగ్మెంట్  ఈవిఎం  యంత్రాలను   రామగిరి మండలంలోని  జేఎన్టియూహెచ్ మంథని కౌంటింగ్ కేంద్రంకు తరలించారు. కౌంటింగ్ కేంద్రంలో అసెంబ్లీ సెగ్మెంట్ ల వారిగా  సిద్దం చేసిన  స్ట్రాంగ్  రూంలలో  ఈవిఎంలను భద్రపర్చి  స్టాంగ్  రూంలను సీజ్ చేసారు.  శుక్రవారం ఉదయం  పెద్దపల్లి పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకులు  రాజారాం  స్ట్రాంగ్  రూంలను పరిశలించి అనంతరం పోలింగ్ ప్రక్రియను  అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారులు,  రాజకీయ పక్షాల సమక్షంలో స్క్రూటిని నిర్వహించారు.  ప్రిసైడింగ్ అధికారుల వద్ద వున్న డైయిరీలు, మైక్రో అబ్జర్వర్ల  నివేదికలను,  అసిస్టెంట్  రిటర్నీంగ్ అధికారులు ఫారం 17ఎ, 17సి  నివేదికలను  పరిశీలించి  దృవీకరించారు, వీటి పట్ల  రాజకీయ పార్టీలు/ అభ్యర్థుల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేసారు.    పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని,  ఎక్కడ  కూడా రీపోల్  చేయాల్సిన అవసరం లేదని , ఎలాంటి  ఫిర్యాదులు సైతం లేవని   రాజకీయ పక్షాలు  రిటర్నింగ్ అధికారికి మరియు  ఎన్నికల సాధారణ పరిశీలకులకు  తెలిపారు. 


65.43 శాతం పోలింగ్ నమోదు 

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 1827  పోలింగ్ కేంద్రాలలో 14,78,062 మంది ఒటర్లు ఉండగా  ఎన్నికలలో   9,67,119(65.43%) ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని,   పోలింగ్ లో 4,82,613 (65.25%)మంది పురుషులు, 483143(65.44%) మంది స్త్రీలు, 16 మంది (19.28%) మంది ఇతరులు పార్లమెంట్ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకున్నారని  తెలిపారు.  అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పరిశీలించుకున్నప్పుడు   చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 225 పోలింగ్ కేంద్రాలలో 1,75,513 మంది ఒటర్లకు గాను 1,23,257(70.23%) , బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్  పరిధిలోని 222 పొలింగ్ కేంద్రాలలో 1,64,275 మంది ఓటర్లకు గాను 1,13,030(68.81%),  మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 277 పోలింగ్ కేంద్రాలలో 2,50,211 మంది ఓటర్లకు గాను 1,48,604(59.39%), ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 269 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,18,484 మంది ఓటర్లకు గాను 1,51,002(69.11%),  రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 259 పోలింగ్ కేంద్రాలలో 2,12,197 మంది ఓటర్లకు గాను 1,18,431 మంది ఓటర్లు (55.81%), మంథని  అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 288 పోలింగ్ కేంద్రాలలో 2,20,129 మంది ఓటర్లకు గాను 1,49,741(68.02%) ,  పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 287 పోలింగ్ కేంద్రాలలో 2,37,253 మంది ఓటర్లకు గాను 1,63,054(68.73%) మంది ఓటర్లు   పార్లమెంట్ ఎన్నికలో   తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని  తెలిపారు.   పెద్దపల్లి  అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో  బంధంపల్లిలోని పోలింగ్ కేంద్రం సంఖ్య 63  లో అత్యల్పంగా 02.47% పోలింగ్ నమోదయిందని, దాసగిరిపల్లి పోలింగ్ కేంద్రం సంఖ్య80లో 89.23% అత్యధికంగా పోలింగ్ నమోదయిందని,  మంథని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో  వెంకట్రావుపల్లి పోలింగ్ కేంద్రం సంఖ్య 16 లో 29.27 % అత్యల్పంగా, తిమ్మడిగూడెం పోలింగ్ కేంద్రం సంఖ్య 206లో 88.15% అత్యధికంగా పోలింగ్ నమోదయిందని, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో  శాంతినేకతన్ పోలింగ్ కేంద్రం సంఖ్య213 లో 27.48 % అత్యల్పంగా, రాయదండి పోలింగ్ కేంద్రం సంఖ్య 19లో 92.63% అత్యధికంగా పోలింగ్ నమోదయిందని, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో  ధర్మపురి  పోలింగ్ కేంద్రం సంఖ్య 43 లో 47.78 % అత్యల్పంగా, పాశిగం  పోలింగ్ కేంద్రం సంఖ్య 74లో 83.15% అత్యధికంగా పోలింగ్ నమోదయిందని, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో  చెన్నూరు పోలింగ్ కేంద్రం సంఖ్య 179 లో 48.34 % అత్యల్పంగా, శంకరపల్లి  పోలింగ్ కేంద్రం సంఖ్య 83లో 88.15% అత్యధికంగా పోలింగ్ నమోదయిందని, మంచిర్యాల  అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో  నస్ పూర్ పోలింగ్ కేంద్రం సంఖ్య 233 లో 29.64 % అత్యల్పంగా, నాగవారం  పోలింగ్ కేంద్రం సంఖ్య 104లో 85.32% అత్యధికంగా పోలింగ్ నమోదయిందని, బెల్లంపల్లి  అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో  పెద్దంపల్లి  పోలింగ్ కేంద్రం సంఖ్య 32 లో 38.33 % అత్యల్పంగా, బెజ్జలి  పోలింగ్ కేంద్రం సంఖ్య 129 లో 91.19% అత్యధికంగా పోలింగ్ నమోదయిందని  తెలిపారు.   ఈవిఎంలను స్ట్రాంగ్  రూంలలో భద్రపర్చామని,   స్ట్రాంగ్  రూంలలో సిసికేమేరాలను ఎర్పాటు చేసామని, మూడు అంచెల భద్రత వ్యవస్థ అమలులో ఉంటుందని  తెలిపారు. ప్రజలు స్వేచ్ఛ ప్రశాంత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు  హక్కుని ఉపయోగించుకొన్నారన్నారు .ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు, సహకరించిన ప్రజలకు మరియు  ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి బందోబస్తు నిర్వహించిన  పోలీస్ అధికారులను,  సిబ్బందిని ,పోలిసులకు సహకరించిన  ప్రజలకు ,మీడియా మిత్రులకు ,ఇతర ప్రబుత్వ శాఖల అధికారులకు  కలెక్టర్  కృతఙ్ఞతలు తెలిపారు .