ఉప్పల్ లో ఈ వేలం రూ.677 కోట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉప్పల్ లో ఈ వేలం రూ.677 కోట్లు

హైద్రాబాద్, ఏప్రిల్ 9, (way2newstv.com
ఉప్పల్‌ భగాయత్‌ లే-అవుట్‌ ఫేజ్‌-2 లోని మల్టీజోన్‌ ప్లాట్ల రెండు రోజుల ఈ వేలంలో హెచ్‌ఎండీఎకు రూ. 677 కోట్లు వచ్చాయి. సగటున చ.గజానికి రూ. 51516లు ధర పలికింది. రెండవరోజు సోమవారం సైతం ఈ-వేలం ఉత్కంఠంగా కొనసాగింది. అధికారులు ఊహించినట్లు గానే మధ్యాహ్నం నుంచి కొనుగోలు దారులనుంచి మంచి స్పందన లభించింది. ఉదయం నిర్వహించిన 17 ప్లాట్ల ఈ వేలంలో అత్యధికంగా చదరపు గజానికి రూ. 50700 లు పలుకగా, అతి తక్కువ రూ. 42100 లు పలికింది. కాగా సగటున చదరపు గజానికి రూ. 48334.68లుగా నిలిచింది. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో ప్రారంభమైన ఈ-వేలంలో 17ప్లాట్లకు గాను మొత్తం విస్తీర్ణ 4418.01 చదరపు గజాలు కాగా వేలంపాటలో మొత్తం రూ. 216,14,30,876 లు( 216కోట్ల 14 లక్షల 30 వేల 876 రూపాయలు) రాబడి వచ్చింది. మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల మధ్య సాగిన( ప్రారంభమైన) వేలంపాటలో మొత్తం 14 ప్లాట్లుకు గాను మొత్తం విస్తీర్ణం 54995 చదరపు గజాలు ఉండగా మొత్తం రాబడి 2588722182(రెండు వందల యాభై ఎనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల డెభై ఇరువై రెండు వేలం నూట ఎనభై రెండు రూపాయలు) వచ్చింది. 


 ఉప్పల్ లో ఈ వేలం రూ.677 కోట్లు

చివరి విడత ఈ-వేలంలో అత్యధికంగా రూ.59800లు చదరపు గజానికి పలుకగా, అత్యల్పంగా రూ.36600లు చదరపు గజానికి పలికింది. సగటున రూ.47071లు చదరపు గజానికి పలికింది. కాగా ప్రభుత్వం నిర్ణీత ధర చదరపు గజానికి రూ.28 వేలు నిర్ణయించింది. కాగా మొదటి రోజైన ఆదివారం జరిగిన 36 ప్లాట్ల ఈ వేలానికి రూ.202 కోట్లు వచ్చాయి. ఉదయం జరిగిన 18 ప్లాట్ల ఈ వేలం లో అత్యధికంగా చదరపు గజానికి రూ.73900 లు రాగా, కనిష్ట ధర రూ.60,900 లు పలికింది. నిన్న ఆదివారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు జరిగిన మరో 18 ప్లాట్ల ఈ-వేలంలో చదరపు గజానికి అత్యధికంగా రూ. 67500లు పలుకగా, కనిష్టంగా రూ.57000లు పలికింది.రెండురోజులపాటు కొనసాగిని ఈ-వేలం పోటాపోటిగా కొనసాగిందని హెచ్‌ఎండీఎ కార్యదర్శి రాంకిషన్‌ తెలిపారు. బిడ్లర్లు పోటీపడి ప్లాట్లను దక్కించుకున్నారన్నారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఎ కమిషనర్‌, ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఆదేశాను సారం తాము శక్తి వంచన లేకుండా పనిచేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ఈ-వేలం ప్రక్రియ పూర్తి చేయటానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆన్‌లైన్‌లో వేలం పాట నిర్వహించడంతో దేశవిదేశాల నుంచి బిడ్లర్లు, వ్యాపారులు, రియాల్టరు పెద్దఎత్తున పాల్గొన్నారన్నారు. ప్రజల్లో అనూహ్య స్పందన రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ-వేలం నిర్వహణను విజయవంతంగా పూర్తిచేయడంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.