పత్తికొండ, ఏప్రిల్ 20, (way2newstv.com)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. పత్తికొండ లోని స్థానిక టిడిపి కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 70వ జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 70వ జన్మదిన వేడుకలు
టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని వారు తెలియజేశారు.మహిళలు, వృద్ధులు,యువకులు టిడిపి ప్రభుత్వంకు అండగా ఉన్నారని వారు తెలియజేశారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం తప్పకుండా విజయం సాధిస్తుందని,మళ్లీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని నాయకులు తెలియజేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో సీనియర్ నాయకులు కె.సాంబశివరెడ్డి, రామానాయుడు,మనోహర్ చౌదరి, అశోక్, సాములా నాయక్,నరసింహులు చౌదరి,బి.టి గోవిందు,విజయమోహన్ రెడ్డి మరియు టిడిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.