హైదరాబాద్ ఏప్రిల్ 5 (way2newstv.com):
నిన్న బంజారాహిల్స్ లో చేపట్టిన తనిఖీల్లో రూ.3.29 కోట్లు పట్టుకున్న పోలీసులు...ఈ కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ..నగదు పట్టుకుంటున్న ఘటనల్లో పౌరుల సహకారం బాగుందన్నారు. ప్రజలు ఇస్తున్న సమాచారంతోనే 70 శాతం నగదు పట్టుకున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు.
ఇప్పటివరకు నగరంలో రూ.9.45 కోట్ల నగదు స్వాధీనం
ప్రజలు మరింత సహకరిస్తే ఎన్నికల్లో ధనప్రవాహం లేకుండా చూస్తామన్నారు.ఇప్పటివరకు నగరంలో రూ.9.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఎన్నికల నియామావళి ఉల్లంఘన కింద 200కేసులు నమోదు చేశాం. 1869మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. నగదు తరలింపు ఘటనల్లో వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయడం లేదని విచారణ కోసమే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నమని సీపీ చెప్పారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలపుడు నగదుతో పట్టుబడిన వారిలో 19మందికి శిక్షలు పడ్డాయన్నారు.