ఆజ్రాత్తతోనే కూలీల దుర్మరణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆజ్రాత్తతోనే కూలీల దుర్మరణం

నారాయణ్ పేట, ఏప్రిల్ 10 (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఘోరం జరిగింది. పని కోసం వెళ్లి కూలీలు 10 మంది చనిపోయారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం 15 మంది వెళ్లారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువు తవ్వకాలు జరుగుతున్నాయి. బాగా లోతుగా పనులు చేపట్టారు. జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. కింద ఉండి కూలీలు పనులు చేస్తుండగా.. పై నుంచి మట్టిదిబ్బలు పడ్డాయి. పెద్దపెద్ద దిబ్బలు కావటంతో కూలీలు అందరూ వాటి కింద చిక్కుకుపోయారు. మట్టితోపాటు రాళ్లు కూడా పడ్డాయి. దీంతో ఘటనా స్థలంలోనే 10 మంది కూలీలు చనిపోయారు. 


ఆజ్రాత్తతోనే కూలీల దుర్మరణం

గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 20 నుంచి 25 అడుగుల లోతులో పనులు జరుగుతున్నాయి. అంతెత్తు నుంచి మట్టిదిబ్బలు, రాళ్లు పడటంతో వెంటనే వారిని కాపాడలేకపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం, యంత్రాలతో ఇష్టమొచ్చినట్లు పనులు చేపట్టినట్లు చెబుతున్నారు స్థానికులు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించనున్నారు.  చనిపోయిన కూలీలు అందరూ మరికల్ మండలం తీనేరు గ్రామస్తులుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నేతలు వెళ్లి పరిశీలించటానికి ఇబ్బందిగా మారింది.