హైదరాబాద్, ఏప్రిల్ 08 (way2newstv.com)
సిటీ లో డ్రగ్స్ అమ్మకానికి ప్రయత్నం చేసిన ఆర్నాల్డ్ పాట్రిక్, అబ్దుల్లా అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. మొత్తం25 గ్రామ్ ల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. పట్టు పడ్డ డ్రగ్ విలువ లక్షా 50 వేలు ఉంటుందని ఎక్సైజ్ అసిస్టెంట్ సుపరిండెంట్ అంజి రెడ్డి అన్నారు.
కోకైన్ కేసులో ఇద్దరు అరెస్ట్
బెంగళూరు నుంచి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. మెహిదీపట్నం, నానల్ నగర్ రెండు చోట్ల సప్లై చేస్తున్నారు. ఆఫ్రికన్ కి చెందిన ఇద్దరు వ్యక్తులతో బెంగళూరు మరో టీం టచ్ లో ఉంది. బెంగళూర్ లో ఎవరు ఉన్నారు అనేది దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. గోవా, బెంగళూర్ అడ్డాగా చేసుకుని డ్రగ్ సరఫరా చేస్తున్నారు. లవ్ ఫెల్యూర్, బిజీనెస్ లో లాస్ అయిన వారిని టార్గెట్ గా చేసుకుని ఈ మధ్య డ్రగ్స్ వాడకం పెరిగింది.