నాగర్ కర్నూలు, ఏప్రిల్ 08 (way2newstv.com)
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునే ఓటరు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు పత్రాలలో ఏదో ఒక దానిని గుర్తింపుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్వేతా మహంతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ గుర్తింపు పత్రాలతో ఓటు వేయవచ్చు
డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మరియు ప్రభుత్వరంగ సంస్థ ల చే జారీ చేయబడిన గుర్తింపు కార్డు, ఫోటో తో కూడిన బ్యాంకు పాస్ బుక్కు లేదా పోస్టాఫీసు పుస్తకము, ఆర్ జి ఐ చే జారీచేసిన స్మార్ట్ కార్డు, ఫోటో ఓటరు గుర్తింపు కార్డు, కార్మిక మంత్రిత్వశాఖ చే జారీ చేయబడిన ఆరోగ్య భద్రత కార్డు, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన గుర్తింపు కార్డుల లో ఏదో ఒక దానిని గుర్తింపుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు