న్యూఢిల్లీ, ఏప్రిల్ 2, (way2newstv.com)
నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్‌సిన్హా తెలిపారు. నిజామాబాద్ పోలింగ్ విషయమై పూర్తిస్థాయిలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉమేష్‌సిన్హా మాట్లాడుతూ.. అభ్యర్థులు భారీగా ఉన్నప్పుడు ఈవీఎం, వీవీప్యాట్‌లు వాడటం ఇదే తొలిసారన్నారు. ఈవీఎంలను మొదటిసారి హైదరాబాద్‌లోనే తయారు చేశారని.. ఎక్కువమంది అభ్యర్థులకు ఈవీఎంలతో పోలింగ్ జరపటం కూడా ఇక్కడే చరిత్రగా నిలుస్తుందన్నారు.
ఆర్మూర్ ఎన్నికలు ఈవీఎంతోనే
ఇప్పటి వరకు గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించినట్లు తెలిపిన ఉమేష్‌సిన్హా మొదటిసారి నిజామాబాద్‌లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. 25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2 వేల కంట్రోల్ యూనిట్లు అవసరమన్నారు. ఫస్ట్ లెవల్ ఈవీఎం చెకింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రంలోగా ఈవీఎంలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇక నిజామాబాద్‌లో 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు. పోలింగ్ పూర్తయ్యే వీరంతా నిజామాబాద్‌లోనే ఉండనున్నట్లు పేర్కొన్నారు.