గ్రామాలలో బి.సి అభ్యర్థుకు రక్షణ కల్పించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామాలలో బి.సి అభ్యర్థుకు రక్షణ కల్పించాలి

ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి  
హైదరాబాద్ ఏప్రిల్ 29 (way2newstv.com)  
జెడ్పిటిసి –ఎంపిటిసి ఎన్నికలలో గ్రామాలలో బి.సి అభ్యర్థులను జనరల్ స్థానాలలో పోటిచేస్తామంటే పోటిచేయవద్దని అగ్రకులాల నాయకులు బి.సి అభ్యర్థులను బెదిరిస్తున్నట్లు పిర్యాదులు వస్తున్నాయని,వెంటనే ముఖ్యమంత్రి  జోక్యం చేసుకొని ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, పొలీస్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేసి బి.సిలకు పూర్తి రక్షణ కల్పించాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య కోరారు. మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజు పిర్యాదులు అందుతున్నాయి. లేని పక్షంలో బి.సిలు తిరుగబడవలిసి వస్తుందని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించినందున ప్రస్తుత జెడ్పిటిసి –ఎంపిటిసి ఎన్నికలలో జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు లను నిలబెట్టి  గెలిపించాలని పిలుపునిచ్చారు. 


 గ్రామాలలో బి.సి అభ్యర్థుకు రక్షణ కల్పించాలి

2010 లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం తగ్గించారు. ఇంకా బీసీలకు అన్యాయం చేయాలని, అణచివేయాలనే కుట్రతో 22 శాతం నుంచి 18 శాతం తగ్గించి జెడ్పిటిసి –ఎంపిటిసి సీట్లను కేటాయించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో సవాళ్లు  ఎదురుకుంటున్న బీసీలు తమ చేతుల్లో ఉన్న ఓట్లను బి.సి లకు వేసి గెలిపించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.టిఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగున బి.సిలకు అన్యాయం చేసింది. ఇకవైపు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గించిoది. మరోవైపు కేటాయింపులలో అక్రమాలకు పాల్పడి 18 శాతం మాత్రమే కేటాయించారు. జనాభా ప్రకారం చూస్తే 32 జిల్లా పరిషత్ లలో 17 జిల్లాపరిషత్ బీసీలకు కేటాయించాలి. గత ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్ల ప్రకారం 12 కేటాయించాలి. కనీసం తగ్గించిన 22 శాతం ప్రకారం చూసిన   7 జిల్లాపరిషత్ లు బిసి లకు కేటాయించాలి. కానీ ఏది పట్టించుకోకుండా అన్యాయంగా బీసీలకు కేవలం 6 జిల్లా పరిషత్ లు  కేటాయించి చారిత్రక ద్రోహం చేశారని విమర్శించారు. ఇక 545 మండల పరిషత్ చైర్మన్ లకు జనాభా ప్రకారం 230 బీసీలకు కేటాయించాలి. 34% రిజర్వేషన్ల ప్రకారం 182 కేటాయించాలి. చివరకు తగ్గించిన రిజర్వేషన్లు ప్రకారం 22 శాతం చూసిన 121 కేటాయించాలి. కానీ కేవలం కేటాయించినవి 96 మాత్రమే అన్నారు. అధికారులకు అంక గణితం కూడా రాదాయని ప్రశ్నించారు. జెడ్పిటిసి –ఎంపిటిసి ఎన్నికలలో బీసీలకు ఉద్దేశపూర్వకంగా అడుగడుగునా మూడు రకాలుగా అన్యాయం చేశారని విమర్శించారు. బి.సిలను రాజకీయంగా అణచివేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.