భోపాల్, ఏప్రిల్ 5 (way2newstv.com)
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్మొహమాటంగా మాట్లాడతారు కాని మృదుస్వభావి. మూడు దఫాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాంకేతికంగా ఓటమి పాలయినా…నైతికంగా గెలిచినట్లేనని చెప్పుకోవాలి. పదమూడేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 114 సీట్లు రాగా, బీజేపీకి 109 సీట్లు రావడానికి కారణం శివరాజ్ సింగ్ చౌహాన్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం ఏడు సీట్ల దూరంలో మిస్ అయింది. లేకుంటీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు.కానీ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్లీ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లోనూ నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలనే కాంగ్రెస్ గెలుచుకుంది.
సింగ్ చక్రం తిప్సేస్తున్నారు
ఈనారి అంతకంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కసితో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఖచ్చితంగా పది నుంచి పదిహేను సీట్లు తక్కువ కాకుండా గెలుస్తామన్న నమ్మకంతో హస్తం పార్టీ నేతలున్నారు.అయితే ఇక్కడ కాంగ్రెస్ గెలుపు అంత ఈజీ కాదన్నది వాస్తవం. శాసనసభ ఎన్నికల్లోనే చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ అప్పుడే కట్టుబాటు తప్పింది. లోక్ సభ ఎన్నికల కోసమే రాహుల్ గాంధీ కమల్ నాధ్ ను ముఖ్యమంత్రిగా చేశారన్నది కాదనలేని నిజం. లోక్ సభ ఎన్నికలు లేకుంటే ఖచ్చితంగా సింధియా సీఎం అయ్యేవారు. ఆ సంగతి ముగ్గరు నేతలకూ తెలుసు. ఇప్పుడు లోక్ ఎన్నికలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ లకు సవాల్ గా మారాయి.కానీ ఇక్కడ శివరాజ్ సింగ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. గతంలో గెలిచిన సీట్లు కూడా రాకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారన్న సానుభూతి ప్రజల్లో పుష్కలంగా ఉంది. చౌహాన్ ను భోపాల్ నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకు చౌహాన్ సుముఖంగా లేకపోయినా పార్టీ ఆదేశాలను పాటించాల్సి వస్తుంది. భోపాల్ లో దిగ్విిజయ్ సింగ్ బరిలో ఉంటారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం చేసే వ్యక్తి కాదన్నది అధిష్టానానికీ తెలుసు. అందుకే మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు కమలం పార్టీని గట్టెక్కించే బాధ్యతను భుజానకెత్తుకున్నారు.