కాంగ్రెస్ నేతలు ముందే చాప చుట్టేశారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్ నేతలు ముందే చాప చుట్టేశారు

హైద్రాబాద్, ఏప్రిల్ 10, (way2newstv.com)
కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో కొరవడింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల రణరంగంలో ముందుగానే చేతులేత్తే సింది. ఎన్నికల యుద్ధభూమి నుంచి వెనుతిరిగిందని గాంధీభవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.. చావోరేవో తేల్చుకోవాలనే పట్టుదల నేతల్లో సన్నగిల్లింది. అందుకే టీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్‌ ప్రచారం చేయడం లేదనే పరిస్థితి నెలకొంది. అయితే నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి, చేవెళ్ల, జహీరాబాద్‌, ఖమ్మం నియెజక వర్గాల్లో ముమ్మరంగా ప్రచారం సాగిందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రత్యేక చొరవ తీసుకుని, వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉన్నదని కూడా విశ్వసిస్తున్నారు. ఆర్థి కంగా బలమైన అభ్యర్థుల ను రంగంలోకి దించా మనీ, ఇక వాళ్లే అంతా చూసుకుంటారని అధిష్టా నం భావిస్తున్నది. కానీ ఆయా నియోజకవర్గాల్లో అభ్య ర్థులు చేస్తున్న ప్రచార సరళి చూస్తుంటే ప్రచారంలో బాగా వెనుకబడిపోయారని పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ముందుగానే ఓడిపోతామన్న అంచనాకు రావడమో, తాము గెలిచే అవకాశం లేదన్న అపన మ్మకమో తెలియదు కానీ కొంత మంది అభ్యర్థులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ బూత్‌స్థాయి కార్యకర్తలను పట్టించు కోవడం లేదనీ, అందుకు దూరంగా ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతు న్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉన్న తమ ఓటర్లను గానీ, బూత్‌స్థాయి ఏజెంట్లనుగానీ సంప్రదించలేదని తెలిసింది. 


కాంగ్రెస్ నేతలు ముందే చాప చుట్టేశారు

కొన్ని నియోజకవర్గాల్లో ఏజెంట్లను నియమించుకోలేదని సమాచారం. ముందస్తు ఎన్నికల్లో కుల, సామాజిక, మేధావులు, ప్రజా సంఘాలతో మాట్లాడటం, ఆయా సంఘాలతో సమావేశాలు నిర్వహించి మద్దతు కూడగట్టారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి కనిపించడంలేదని పార్టీ నేతలు అంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పార్టీ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వడం లేదని పార్టీ నేతల్లోనే ప్రచారం జరుగుతున్నది. మెదక్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ ఎప్పుడో అధికార టీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్‌ కూడా ఇచ్చినట్టు గుసగు సలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లోపాయికారీ ఒప్పందాలు చేసుకు న్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్‌ అభ్యర్థి జాతీ య నేత మధుయాష్కీగౌడ్‌ బలమైన నేత అయినప్పటికీ.. ఆయ నకు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హవాలో రెండుసార్లు గెలిచినా ఆయన దాన్ని నిలబెట్టుకోలేదని స్థానికులు అంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య పోటీ అన్నరీతిలో ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లోనూ ఆశించిన రీతిలో అభ్యర్థులు ప్రచారం చేయడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నది. దీన్ని ఆసరా చేసుకుని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమిభయంతో ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితమవుతున్నారని టీఆర్‌ఎస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో అధిష్టానం సహకరించడం లేదని మహబూబాబాద్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ బహిరంగంగానే వెల్లడించారు. చాలా మంది అభ్యర్థులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పార్టీ గెలుపోటములను నిర్ణయించేవి పోలింగ్‌ కేంద్రాలు. కొన్ని చోట్ల ఇప్పటికి ప్రచారానికి కూడా వెళ్లలేదని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 1800 నుంచి 2వేల బూత్‌లు ఉంటాయని అంచనా. పార్టీ మ్యానిఫెస్టోను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కొంత మంది అభ్యర్థులు విఫలమైనట్టు తెలిసింది. కానీ బూత్‌స్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతున్నది. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ 6వేలు, ఏడాదికి రూ 72వేలు ఇస్తామన్న హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ చాలా వెనకబడి ఉందని విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసే నాయకుడు లేకపోవడం, రాష్ట్ర నాయకత్వం వారి నియోజకవర్గాలకు పరిమితం కావడమే ఇందుకు కారణం. స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతికి కూడా పార్టీ నుంచి సరైన సహకారం లేదని తెలిసింది. ఎవరైనా ప్రచారానికి ఆహ్వానిస్తే అక్కడికి వెళ్లి ప్రచారం చేయడమే తప్ప తనకు తాను వెళ్లి ప్రచారం చేసే చొరవ చూపడంలేదు. ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కూడా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆయనకు ప్రతిపక్షహోదా పోతుందనే భయం పట్టుకుందని, అందుకే ఆయన కూడా ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించడం లేదనే చర్చ జరుగుతున్నది. దీంతో ఆయన కూడా ప్రచారానికి పెద్దగా వెళ్లలేదని పార్టీ నేతలు అంటున్నారు. పెద్దపల్లి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు కేటాయించింది. ఆయా నియోజకవర్గాల్లో కీలకమైన నేతలు ఉన్నప్పటికి కొత్తవారికి టికెట్లు ఇవ్వడంతో వారికి సహకరించడం లేదు. దీంతో కొంత మంది కాంగ్రెస్‌ అభ్యర్థులకు ముందుగానే ఓటమి భయంపట్టుకుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.