కరెంట్ సమస్యలకు చెక్

హైద్రాబాద్, ఏప్రిల్ 13, (way2newstv.com)
తెలంగాణ విద్యుత్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ సేవకు శ్రీకారం చుట్టింది. ఇంటికి సంబంధించిన విద్యుత్ సరఫరా సమస్యలే కాదు సామాజిక బాధ్యతలో భాగంగా కాలనీల్లో, నగరంలో, రోడ్ల వెంట మనకు కనిపించిన కరెంట్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం ఉండటంతో ఆన్‌లైన్ ఫిర్యాదులపై కిందిస్థాయి సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ఇప్పటికే విద్యుత్ వినియోగాదారులకు మొబైల్ యాప్‌ను, ఆన్‌లైన్ పేమెంట్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి మన్ననలు అందుకుంది.  ఒక్క క్లిక్‌తో 33 రకాల విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు చేసే వెసులుబాటును వినియోగదారుల ముంగిట ఉంచింది. మీరు జస్ట్ నో పవర్ క్లిక్ మీపై ఒక్క క్లిక్ చేయండి మీ సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. దీంతో వినియోగదారుల సమస్యలు సత్వరం పరిష్కారం కానున్నాయి.  


కరెంట్ సమస్యలకు చెక్

ఇందులో ప్రధానంగా డీటీఆర్ (డిస్ట్రీబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్)ఫెయిల్యూర్, డిస్ట్రీబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫెన్సిం గ్ లేకపోవడం, విద్యుత్ సరఫరా జరుగుతున్న సమీపంలో మంటలు వచ్చినా, ఎవరైన స్మోకింగ్ చేస్తున్నా, డీటీఆర్‌కు వాహనాలు తగిలినప్పుడు, ఇంట్లో కరెంట్ షాక్, జంపర్ కట్, లైన్ బంచడ్, కరెంట్ పోల్ డ్యామేజ్, కరెంట్ పోల్ షాక్, కరెంట్ పోల్‌కు కండక్టర్ తగలడం, కరెంట్ పొల్‌కు వాహనాలు, విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగిలినా, ఓవర్‌హెడ్ లైన్ బ్రేక్‌డౌన్, ఫేజ్ రివర్స్, లోవోల్టేజ్, హైవోల్టోజ్, పవర్ కరెంట్, పవర్ రావడం పోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, తరుచు తలెత్తుతున్న ఒకే రకమైన సమస్య, సర్వీస్ వైర్‌పై మంటలు తదితర  సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు.విద్యుత్ సరఫరా సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయాలంటే తొలుత  తెలంగాణ విద్యుత్ సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఇందులో కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను క్లిక్ చేయాలి. మీ ఫోన్ నెంబర్, పేరు, సర్వీస్ నెంబర్, అడ్రస్ నమోదు చేస్తే మీరు చేసిన ఫిర్యాదు ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. ఈ ఫిర్యాదులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండటంతో పాటు వచ్చిన ఫిర్యాదుపై స్థానిక అధికారులను అప్రమత్తం చేస్తారు. 
Previous Post Next Post