కావాలనే నాఫై దుష్ప్రచారం : చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 10 (way2newstv.com)
చేవెళ్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై కావాలనే తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు సంబంధించిన వ్యక్తి దగ్గర రూ.10లక్షలు దొరికాయంటూ మీడియాకు పోలీసులచే తప్పుడు సమాచారం ఇప్పించారని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తి దగ్గ 10 లక్షలు దొరికితే 15 కోట్లు దొరికాయని ,ఆవ్యక్తి ఇంటి పేరు కొండా అని ఉన్నంత మాత్రాన అతను నాకు సంబందించిన వ్యక్తా అని ఆయన ప్రశ్నించారు.తనఫై తప్పుదు ప్రచారం చేస్తున్నారంటూ బుదవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రదానధికారి రజిత్ కుమార్ ను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్ కుమార్, రాష్ట్ర ఎన్నకల సమన్వయ కమిటి కో-ఆరినేటర్ జి.నిరంజన్,పార్టీ క్రమశిక్షణ కమిటి చేర్మెన్ కోదండ రెడ్డి తో కలిసి పిర్యాదు హీసారు.
టిఆర్ఎస్ పార్టీకి ఓడిపోతమన్నా భయం పట్టుకుంది
అనంతరం ఆయన మాట్లాడారు. తాను భారీ మెజార్టీతో గెలుస్తాననే భయంతో ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. తన నియోజకవర్గంలో పరిధిలోని కింది స్థాయి క్యాడర్‌ను కొన్నారని తెలిపారు. తనపై చేస్తున్న దుష్ప్రచారంపై సీఈవోకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.రూ.10 లక్షలు దొరికితే 15 కోట్లు అంటూ మీడియాకు సమాచారం ఇచ్చిన గచ్చిబౌలి ఎస్ఐఫై చర్యలు తెవేసుకోవాలని డిమాండ్ చేసారు.ఎలాంటి వాటి విషయం లో మీడియా కుడా వాస్తవాలను తెలుసుకొని వార్తలను ప్రచురించాలని విజ్ఞప్తి చేసారు.అనంతరం దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ చేవెళ్లలో కొండా గెలుపు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత ధీమా వ్యక్తం చేశారు. కొండాకు సంబంధించిన వ్యక్తి దగ్గర రూ.10లక్షలు దొరికితే రూ.10కోట్లు దొరికాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవి పది కోట్లని నిరూపిస్తే మేము ముక్కు నేలకు రాస్తామన్నారు. లేదంటే డబ్బు పట్టుకున్న పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.తమ పిర్యడును చుసిన ఈసి 15 కోట్లు కాదు 10 లక్షలని పేర్కొనడం జరిగిందన్నారు. రాష్ట్ర ఎన్నకల సమన్వయ కమిటి కో-ఆరినేటర్ జి.నిరంజన్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ను ఉల్లంగించి ప్రగతి భవన్ ను రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.టిఆర్ఎస్ అబ్యర్తుల ‘బి’ఫారాలను ప్రగతి భవన్ లోనే ఇచ్చారని పేర్కొన్నారు.ఇలాంటి అనేక విషయాలఫై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారికి అనేక మార్లు పిర్యాదు చేసినా ఆక్షన్ తెసుకుంటాం,నోటిసులు ఇస్తాం అని చెప్పడం తప్ప పట్టించులోలేదని ఆరోపించారు.