హైదరాబాద్, (way2newstv.com)
తెలంగాణా పౌల్ట్రీ రైతులు శనివారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ను కలిసి కోళ్ల పెంపకం దారులు ఎదుర్కుంటున్నల వివిధ సమస్యలను వివరించారు. వాటి పరిష్కారం కోసం కోరుతూ వినతి పత్రం అంద జేశారు. అసాధారణంగా పెరుగుతున్న ఫీడ్ ఖర్చు తో సమాంతర గుడ్డు రేటు పెరగకపోవడం తో రైతులు నానా విధాలుగా నష్ట పోతున్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన పౌల్ట్రీ రైతులు
ఒక గుడ్డు పై సుమారు ఒక రూపాయి నష్టపోతున్న తెలంగాణ రైతులు రోజుకు 3 లక్షల పైగా నష్టపోతున్నారని మంత్రితో చెప్పుకున్నారు. దీనికి ప్రభుత్వ అధ్వర్యంలో ప్రత్యేక ఎగ్ బోర్డు ను ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులే గుడ్డు ధరలను నియంత్రణ చేయాలని వ్యవసాయ మంత్రి కు సూచించారు. రైతుల సమస్యల పై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ దృష్టి కి తీసుకెళ్ళి, రైతులకు మేలు అయ్యేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.