నీళ్లు లేక మృత్యువాతపడిన చేపలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీళ్లు లేక మృత్యువాతపడిన చేపలు

వనపర్తి, ఏప్రిల్ 15  (way2newstv.com)
వేసవి ఎండలు మండుతున్నాయి. దానికి తోడు వర్షాభావంతో చెరువులో నీరు అడుగంటిపోగా దాదాపు 30 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో కామదేనుపల్లి చెరువులో నీరు పూర్తిగా అడుగంటి పోయింది.  దీంతో గత మూడు రోజుల నుండి చెరువులో ఉన్న చేపలు మృత్యువాత పడుతూ వస్తున్నాయి. 


నీళ్లు లేక మృత్యువాతపడిన చేపలు

తెలంగాన ప్రభుత్వం మత్య్సకారులకు సంవత్సరం కిందట వారి జీవనాధారం కోసం ఇచ్చిన చేపలు చనిపోవడంతో మత్య్సకారులు బ్రతుకులు రోడ్డున పడ్డాయి అన్ని ఆందోళన చెందారు.  చేపలు పెరిగి మేము అమ్ముకునే సమయంలో మృత్యువాత పడడం మాకు నష్టం జరిగిందాన్ని వాపోయారు.  ఒక్కో చేప 5, 6 కీలలోలు ఉంటాయి, ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా చేపలు బరువు పెరిగి మాకు లాభాలు వస్తుండే అన్ని వారు ఆవేదన చెందారు.  అసలే ఎండకాలం దానితో రైతులు పంటలు చివరి దశలో ఉండడంతో మోటర్ల ద్వారా నీటిని తొడరు.  దీంతో చెరువులో ఉన్న చేపలన్ని నీరు లేక మృత్యువాత పడ్డాయి అంటూ మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేసినారు. చేపలకు, దాణ కు కలిపి 40 లక్షలు ఆస్థి నష్టం జరిగినట్లు మత్య్సకారులు వాపోయారు.  ప్రభుత్వం, మత్య్సశాఖ ఆదుకోవాలని మత్య్సకారులు కోరుతున్నారు.