సత్ఫాలితాలు ఇస్తున్న ధాన్యం ఆన్ లైన్ కొనుగోళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సత్ఫాలితాలు ఇస్తున్న ధాన్యం ఆన్ లైన్ కొనుగోళ్లు

నిజామాబాద్, ఏప్రిల్ 12 (way2newstv.com)
అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాలశాఖ అనేక సంస్కరణలు తెస్తోంది.  తాజాగా ధాన్యం కొనుగోలులో ఆన్‌లైన్ విధా నం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్తగా అమల్లోకి వచ్చే ఆన్‌లైన్ విధానంతో ధాన్యం రైతులకు లబ్ధి చేకూరనుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన వెంటనే ప్రభుత్వం నుంచి రైతులకు డబ్బు అందనుంది. ఇన్నాళ్లు ఆఫ్‌లైన్ విధానం వల్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ట్యాబ్‌లో అప్‌లోడ్ చేస్తే సివిల్ సప్లయ్ అధికారులు పరిశీలించి చెల్లింపులు జరిపారు. ట్రక్ షీట్ రాయటం, రైస్ మిల్లర్ల నుంచి తమకు ధాన్యం చేరినట్లు లిఖిత పూర్వక సమాధానం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తమ కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతుల పేర్లు, వివరాలు ఆప్‌లోడ్ చేశారు. దీనికి కొన్ని రోజుల సమయం పట్టేది. అప్‌లోడ్ అయిన తర్వాతే సివిల్ సప్లయి అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు చేశారు. ఫలితంగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బు అందటానికి కొన్ని సందర్భాల్లో పది నుంచి ఇరవై రోజుల సమయం పట్టింది.ప్రస్తుత యా సంగి సీజన్ నుంచే ఈ సరికొ త్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల నుంచి సివిల్ సప్లయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కేంద్రాల నుంచి ధా న్యం దిగుమతి చేసుకునే రైస్ మిల్లులను జియో ట్యాగింగ్ చేయనున్నారు. 


సత్ఫాలితాలు ఇస్తున్న ధాన్యం ఆన్ లైన్ కొనుగోళ్లు

ఈ నెల 15వ తేదీలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల జియోట్యాగింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్‌లైన్ విధానం అమలుతో రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులో అక్రమాలకు తెరపడనుండగా రైతులకు ప్రయోజనం చేకూరనుండటం విశేషం. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్లలో పౌరసరఫరాల సంస్థ అధికారులు గ్రామాల్లో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలు పీఏసీఎస్, ఐకేపీ, జీసీసీకి అప్పగిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుగానే ఈ సంఘాలకు గన్నీ సంచులను స రఫరా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు నిర్వహించినందుకు సదరు సంఘాలకు క్వింటాల్ పద్ధతిన చార్జీలు చెల్లిస్తున్నారు. టెండర్ పద్ధతిన పౌరసరఫరాల సంస్థతో అగ్రిమెంటు చేసుకున్న ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని లారీల ద్వారా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. అధికారులు సూచించిన రైస్‌మిల్లుల్లో దిగుమతి చేసి ట్రాన్స్‌పోర్టు చార్జీలు పొందుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానంలో ఈ ధాన్యం దిగుమతి చేసుకుని నూర్పిడి చేసి బియ్యా న్ని ప్రభుత్వానికి అందజేసినందుకు పౌరసరఫరా ల సంస్థ అధికారులు రైస్ మిల్లర్లకు మిల్లింగ్ చా ర్జీలు ఇస్తున్నారు. అక్రమాలకు తావిస్తున్న ఈ విధానంలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ పద్ధతిని అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని నూర్పిడి చేసేందుకు సీఎంఆర్ కోసం సివిల్ సప్లయ్ అధికారులు రైస్‌మిల్లర్లకు కేటాయించటంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆయా రైస్ మిల్లు టన్నేజి కెపాసిటీ ఆధారంగా ధాన్యం కేటాయింపులు జరపాల్సి ఉండగా, ప్రతీ సీజన్‌లో తక్కువ కెపాసిటీ గల కొన్ని రైస్ మిల్లులకు ఎక్కువ ధాన్యం, ఎక్కువ కెపాసిటీ గల కొన్ని రైస్ మిల్లులకు తక్కువ ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఆన్‌లైన్ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులకు అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే టన్నేజి పద్ధతిన పౌరసరఫరాలశాఖ అధికారులు రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. టన్ను కెపాసిటీకి వెయ్యి టన్నుల లెక్కన రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపులు జరపాలని ప్రభుత్వ నిబంధన. ఈ పద్ధతిన గరిష్ఠంగా ఎనిమిది టన్నుల కెపాసిటీ గల రైస్ మిల్లుకు ఒక్కో సీజన్‌లో ఎనిమిది వేల టన్నులకు మించి ధాన్యం కేటాయింపు జరిగే అవకాశం ఉండదు. ఆయా రైస్ మిల్లు టన్నేజి కెపాసిటీని ముందుగానే టెస్టు చేసి నిర్ధారిస్తున్న అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. సీఎంఆర్ కోసం తాము ధాన్యం కేటాయించే ప్రతీ రైస్‌మిల్లునూ జియో ట్యాగింగ్ చేస్తారు. తద్వారా ఆయా రైస్ మిల్లు టన్నేజీ కెపాసిటీ, ధాన్యం కేటాయింపులు, సీఎంఆర్ సమాచారం పూర్తిగా ఆన్‌లైన్‌లో దర్శనం ఇవ్వనుంది. అంతేకాదు ఆయా రైస్‌మిల్లుకు దిగుమతి అయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం సివిల్‌సప్లయ్ అధికారులు ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలనూ జియో ట్యాగింగ్ చేస్తారు. దీంతో ఆయా కేంద్రానికి సమీపంలో ఉండే రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయింపు జరగనుంది. ఇన్నాళ్లూ ఒక ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాల నుంచి మరో ప్రాంతంలోని రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిగాయి. ఆన్‌లైన్ విధానంతో ఏ ప్రాంతంలోని కేంద్రాల్లో కొనుగోలు చేసే ధాన్యం ఇకనుంచి ఆ ప్రాంతంలోని రైస్ మిల్లుకే పౌరసరఫరాల సంస్థ అధికారులు కేటాయించనున్నారు. కొనుగోలు కేంద్రానికి సమీపంలో రైస్ మిల్లులు లేకపోతే అప్పుడు దూరప్రాంతంలోని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించే ప్రతిపాదనను పరిశీలిస్తారు.యాసంగి సీజన్ నుంచి ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సివిల్ సప్లయి అధికారులు జిల్లాలో కొద్ది రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 278. వీటిలో భూపాలపల్లి జిల్లాలో 140, ములుగు జిల్లాలో 138 ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలోని రైస్ మిల్లులను కూడా ఈ నెల పదిహేనో తేదీలోగా అధికారులు జియో ట్యాగింగ్ చేయనున్నారు.