ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించాలి

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్
వరంగల్, ఏప్రిల్ 9 (way2newstv.com)
ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని 15-వరంగల్(ఎస్‌సి) పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అన్నారు. మంగళవారం రిటర్నింగ్ అధికారి ఏనుమముల మార్కెట్ యార్డు లో వరంగల్(ఎస్‌సి) పార్లమెంట్ లోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. టేబుళ్ల ఏర్పాటు, వాహనాల రాకపోకలు, సెక్టోరల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల టేబుళ్ల ఏర్పాటు, భోజన సదుపాయం తదితరాలపై సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కి ముందు, పోలింగ్ రోజున చేపట్టాల్సిన చర్యలు, సమర్పించాల్సిన నివేదికల గురించి మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, ఈవిి‌ఎం లు మాక్ పోల్ సందర్భంలో, పోలింగ్ సందర్భంలో రీప్లేస్మెంట్ నివేదిక ఈసిి‌ఐ‌ఎల్, డి‌ఈ‌ఓ నమూనాల్లో సమర్పించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి, సెక్టోరియల్ అధికారుల నుండి మాక్ పోల్ క్లియరెన్స్ దృవీకరణ తీసుకోవాలన్నారు. సెక్టోరియల్ అధికారులు పోలింగ్ రోజున ఉదయం 8.00 గంటలకల్లా తమ తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలన్నారు. 


ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించాలి 

సి-కేటగిరీ ఈవి ‌ఎం లను లేఖ ద్వారా సుబేదారీ కలెక్టరేట్ లోని గోడౌన్ కు, డి-కేటగిరిలోని ఈవి ‌ఎం లను స్క్రూటిని తరువాత మేడ్చెల్, కండ్లకోయి లోని స్టేట్ వేర్ హౌజ్ కు తరలించాలని అన్నారు. స్ట్రాంగ్ రూం లో ఏ,బి కేటగిరీ ఈవి ‌ఎం లనే భద్రపర్చాలన్నారు. ఏ‌ఆర్‌ఓ లు కంట్రోల్ యూనిట్ ను, వి‌విఫ్యాట్ లను జాగ్రత్తగా తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ రోజున బూత్ లెవల్ అధికారుల నుండి పి‌డబ్ల్యూడి ఓటర్ల వివరాలు తెప్పించి, ఓటు హక్కు వినియోగించిన పి‌డబ్ల్యూడి ఓటర్ల సంఖ్య ను ఎన్నికల సంఘానికి సమర్పించాలన్నారు. వెబ్ కాస్టింగ్ కు విద్యార్థులను సమన్వయం చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజున ఉదయం 08.00 గంటల కల్లా డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున సహాయ రిటర్నింగ్ అధికారులు తమ కార్యాలయాల్లో ఉండే పర్యవేక్షణ చేయాలని, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆయన అన్నారు. సమయానుసారంగా పంపల్సిన నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజున పోలింగ్ సిబ్బంది కేంద్రం నుండి వెళ్ళినట్లు, పోలింగ్ కేంద్రాలకు చేరినట్లు దృవీకరణలు సమర్పించాలన్నారు. రవాణా కు వాహనాల కొరకు రవాణా శాఖ అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. వాహనాలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వచ్చే ముందే డీజిల్ నింపుకొని వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల క్రమ సంఖ్యలు, టీంల నంబర్లు, మైక్రో అబ్జర్వర్ల రాండమైజేషన్, టీంల ఉత్తర్వులు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. వీటి ప్రతులు ఏఆర్‌ఓ లు, ఇఆర్‌ఓ లు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం లోపల విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎలక్ట్రిషియన్ ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మాల్ ప్రాక్టీస్, ఓటర్ టర్నోవర్, 50 శాతం లోపల, 50 శాతానికి మించి, పోటో ఓటర్ స్లీప్ లేకుండా ఓటింగ్ చేసిన వారి జాబితా, 5 ఓట్లకు పైగా టెండర్ ఓట్లు, ఛాలెంజ్ ఓట్లు రికార్డ్ అయిన పోలింగ్ కేంద్రాల వివరాలు, 90 శాతం పైగా ఓటింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల నివేదికలు సమర్పించాలన్నారు. ఒరిజినల్ పి‌ఓ డైరీ, ఒరిజినల్ పి‌ఓ డిక్లరేషన్, 17ఏ రిజిస్టర్, మాక్ పోల్ సర్టిఫికెట్లు, 17సి ఫోటో కాపీ, మైక్రో అబ్జర్వర్ల నివేదిక, పరిశీలకులకు పి‌ఓ లు సమర్పించే అదనపు నివేదికలు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వాతావరణంలో మార్పు వచ్చి వర్షం వస్తే అందుకు సిద్ధంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర్షం రావచ్చనే ముందు చూపుతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్లు సంతోష్, మనూచౌదరి, సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్.రవికిరణ్, వెంకారెడ్డి, మహేందర్ జీ, బల్దియా అదనపు కమిషనర్ సి‌హెచ్.నాగేశ్వర్, తహసీల్దార్లు పూజారి కిరణ్ కుమార్, రాజేష్, బావుసింగ్, నాగేశ్వర్, దివాకర్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.