కేసీఆర్ యూ టర్న్ వెనుక... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ యూ టర్న్ వెనుక...

హైద్రాబాద్, ఏప్రిల్ 9, (way2newstv.com)
కేసీఆర్ ప్రసంగంలో హైలెట్ ఏమిటంటే ఆంధ్రులతో పంచాయతీ లేదని..వారంతా మంచి వాళ్లే అన్నారు. ఈ మాట విని… ప్రసంగం వినేవాళ్లు కూడా ఆశ్చర్యపోయే ఉంటారు. ఎందుకంటే.. ఉద్యమ సమయంలో.. ఆంధ్రవాలే భాగో… తెలంగాణవాలే జాగో.. అనే నినాదం ఇవ్వడమే కాదు… ఆంధ్ర కుక్కలు నుంచి.. ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అనే పదాలు విరివిగా వాడారు. ఇప్పుడు కేవలం చంద్రబాబుతో పాటు..మరో పది మంది మాత్రమే కిరికిరిగాళ్లని.. అందరూ మంచివాళ్లేనని ప్రకటించేస్తున్నారు. కేసీఆర్ ప్రకటనలు ఆయనలో రాజకీయ అవసరాలు తెచ్చిన మార్పులుగా రాజకీయపార్టీలు చెబుతున్నాయి. చంద్రబాబు. వ్యక్తిగతహోదాలో కాదు.. ఏపీ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారు. ఆ విషయాన్ని బయటకు రాకుండా.. ఏపీ ప్రజలు మంచి వాళ్లని చెబుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది…. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ.. ఒకేరకంగా ఉన్న ఆయన విధానం.. ఇప్పుడు.. ఏపీలో మిత్రుడు జగన్ ను గెలిపించడానికి.. మార్చుకున్నారు. 


కేసీఆర్ యూ టర్న్ వెనుక...

ఆంధ్రావాలా భాగో లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులే అంటూ మానుకోటలో రాళ్లతో కొట్టి, జగన్‌ను తిరగకుండా చేసిన కేసీఆర్. ఇప్పుడు ఏపీలో ఆయన గెలవడం.. తనకు అవసరం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. “తెలంగాణ జనం చెప్పింది నమ్ముతరు, చప్పట్లు కొడతరు, వోట్లేస్తారు అనేది కేసీఆర్ ఫీలింగ్ లా ఉంది. కేసీఆర్ తంత్రంలో తాజా ఎపిసోడ్లు ఇలాగే ఉన్నాయి. ఆంధ్రావాళ్లు చాలా మంచోళ్లట, జగన్ మరీ మంచోడు… ప్రత్యేకహోాదా ఇస్తే అస్సలు అభ్యంతరం లేదు, పైగా తప్పకుండా ఇవ్వాలంటున్నారు. జగన్‌తో కలిసి కేసీఆర్.. కేంద్రం మెడలు వంచి, ప్రత్యేక హోదా తెస్తారట. అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల్ని జగన్ జేబుల్లోకి కుక్కేంతగా కేసీఆర్ మాటలున్నాయన్న అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది. అక్కడ జగన్ గెలవాలి కదా, అందుకని ప్రత్యేక హోదాకు జై అంటున్నారని.. తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం అని కేసీఆర్ చెప్పిందే. పారిశ్రామికంగా నష్టదాయకం, పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని కేసీఆరే చెప్పారు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ వోట్ల కోసం పాలసీ, నీ విధానం రివర్స్ అయిపోయిందా..? చంద్రబాబు చెప్పినట్టు హైదరాబాదు ఖాళీ అయినా పర్లేదా..? అన్న చర్చలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. జగన్ వోట్ల కోసం, చక్రాలు తిప్పటానికి జగన్ మద్దతు ఇవ్వడం కోసం తెలంగాణ నష్టపోయినా పర్లేదా..? ఇప్పుడు.. కాంగ్రెస్ కు.. కేసీఆర్ కు తేడా లేదు. అదే ప్రత్యేక హోదా కోసం మోడీ మీద పోరాడుతున్నానని చెబుతున్న చంద్రబాబుకు కూడా కేసీఆర్ మద్దతునిస్తారా..? చంద్రబాబుతో కలిసి అన్నీ పక్కనపెట్టి, ప్రత్యేకహోదా కోసం కేసీఆర్ పోరాడే అవకాశం ఉండబోతోందా..?