నంగునూరు, ఏప్రిల్ 09 (way2newstv.com)
మెదక్ పార్లమెంటు అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని తెరాస పార్టీ నాయకులు కోరారు. మంగళవారం ఉదయం నంగునూరు మండలంలోని ఖాతా, పాలమాకుల, అక్కెనపల్లి, ఘనపురం గ్రామాల్లో టిఆర్ ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఖాతా గ్రామంలో టిఆర్ ఎస్ నాయకులు కోమాండ్ల రాంచంద్రారెడ్డి, కూతురు రాజిరెడ్డి, కమాల్ షరీఫ్, మండలపరిషత్ ఉపాధ్యక్షులు నర్సీంలు, సర్పంచ్ ధశమంతారెడ్డి, రాములు, బాల్ నర్సయ్య , సంపత్, రాజు, తదితరులు ప్రచారం నిర్వహించారు. కాగా పాలమాకుల గ్రామంలో నాయకులు రాగుల సారయ్య, జాప శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఐలయ్య, వేణు చక్రవర్తి, రవీందర్ రెడ్డిలు పాల్గొనగా ఘనపురం గ్రామంలో లక్ష్మారెడ్డి, తిరుపతి, వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
నంగునూరు మండలంలో టిఆర్ ఎస్ ఇంటింటా ప్రచారం
అక్కెనపల్లి గ్రామంలో కిష్టారెడ్డి, సోమిరెడ్డి, నాగేంద్రం, సిద్దులు తదితరులు ప్రచారం నిర్వహించారు. రాంపూర్ గ్రామంలో నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పిఏసిస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ,దువ్వలమల్లయ్య, పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్, సంగు పురేందర్, రహీంపాషా, లక్ష్మారెడ్డి,సర్పంచుల ఫోరం అధ్యక్షులు వేముల కొండల్ రెడ్డి, సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి నాయక్, చక్రపాణి, ఎంపిటిసి, వెంకట్ రాజం, నాయకులు ఆకుబత్తిని రాము, గంప రాంచందర్ రావు, మహిపాల్ రెడ్డి, పర్శరాములుగౌడ్, సిద్దులు, వెంకన్న, చంద్రమౌళి, బెదురు తిరుపతి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా నర్మెట గ్రామంలో మంగళవారం ఉదయం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అజీజ్, అధ్యక్షులు నార్లపురం శ్రీనివాస్, సీనియర్ నాయకులు పుప్పాల నారాయణ, ఉప సర్పంచ్ గందమాల కుమార్, నాయకులు శనిగరం బాబు, బండోజు శేఖర్ చారి, చేర్యాల మల్లేశం, నలుమాల మల్లేశం, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.