మత్స్యానికి మంచిరోజులు (మహబాబూబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మత్స్యానికి మంచిరోజులు (మహబాబూబాద్)

మహబూబాబాద్, ఏప్రిల్ 22  (way2newstv.com): 
ఉమ్మడి జిల్లాలోని రైతులకు, మత్య్సకారులకు మంచి రోజులు వచ్చాయి. చేపల పెంపకం, విక్రయాలకు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా నీలి విప్లవం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా  సుమారు 30 విభాగాలకు సంబంధించిన పరికరాలను రాయితీపై అందిస్తోంది. ఇప్పటికే వందశాతం ఉచితంగా చేప పిల్లలను మత్య్సకారులకు అందిస్తున్నారు. వీటితోపాటు రూ.లక్షల్లో రాయితీ ఇస్తూ కొత్త పథకాలను రూపొందించి అందిస్తున్నారు.చేపలు పెంచేందుకు కొత్త చెరువులు నిర్మించుకునేందుకు రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. లేదా ఐదేళ్ల పాటు లీజుకు తీసుకొని కూడా నిర్మించుకునేందుకు అవకాశం ఉంది. నీటి సౌకర్యం కలిగి ఉండాలి. 


మత్స్యానికి మంచిరోజులు (మహబాబూబాద్)

ఒక్క చేపల చెరువు హెక్టారు భూమిలో నిర్మించుకునేందుకు మొత్తం ఖర్చు రూ.7 లక్షలు అవుతుంది. ఇందులో ప్రభుత్వం 40 శాతం రాయితీ కింద రూ.2.80 లక్షలు చెల్లిస్తుంది. మిగతా 60 శాతం కింద లబ్ధిదారుడు రూ.4.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క చేప పిల్లల హేచరీ నిర్మించుకునేందుకు మొత్తం రూ.25 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం  40 శాతం రాయితీ కింద రూ.10 లక్షలు ఇస్తుంది. మిగతా 60 శాతం కింద లబ్ధిదారుడు 15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.ఒక ఐస్‌ ప్లాంటు నిర్మాణానికి రూ.25 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం 40 శాతం రాయితీ కింద రూ.10 లక్షలు అందిస్తుంది. మిగతా 60 శాతం కింద లబ్ధిదారుడు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. చేప పిల్లల రేరింగ్‌ యూనిట్‌కు అంటే ఒక హెక్టారులో నిర్మించుకుంటే రూ.6 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో 40 శాతం రాయితీ కింద ప్రభుత్వం రూ.2.40 లక్షలు రైతులకు అందిస్తుంది. మిగతా 60 శాతం కింద లబ్ధిదారుడు రూ.3.60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
సంచార చేపల విక్రయ యూనిట్లు  కేవలం ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రమే ఇస్తున్నారు. రాయితీ కూడా 60 శాతం ఇస్తున్నారు. ఒక్క యూనిట్‌ ధర రూ.10 లక్షలు. ఇందులో ప్రభుత్వం 60 శాతం రాయితీ కింద రూ.6 లక్షలు అందిస్తుంది. మిగతా 40 శాతం కింద రైతులు రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.