బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
పాములపాడు ఏప్రిల్ 08 (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రచార జోరును టిడిపి పెంచింది పాములపాడు మండల పరిధిలోని భానుముక్కుల, వేంపెంట, మద్దూరు, గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి జయరాజు ,బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శాసనసభ్యుడు ఐజయ్య, తేదేపా నాయకులతో కార్యకర్తలతో ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి అనుభవంగల ముఖ్యమంత్రి రాష్ట్రానికి చాలా అవసరమని ఆయన గుర్తు చేశారు తెదేపాకు గెలిపించుకోవడం చాలా అవసరం అని అన్నారు.
రాష్ట్రానికి అనుభవం ఉన్న సీఎం అవసరం
మాండ్ర శివానందరెడ్డి 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నందికొట్కూరులో చేపట్టిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు, చేసిన సంగతి గుర్తు చేశారు బండి జయరాజ్ రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం వచ్చాక చేయబోయే పనుల గురించి ప్రజలకు వివరించడం తో పాటు తాను పర్యటించి అభివృద్ధి పనులు రోడ్లు,, నీటి ట్యాంకులు, ఇస్తున్న పింఛన్లు, గృహాలు తదితర వాటిని గుర్తు చేస్తూ ఇలాంటి సంక్షేమ అభివృద్ధి పనులు మరింతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వెయ్యాలని ఆయన కోరారు. . పట్టణ మరియు గ్రామాల ప్రజలకు తాగునీటికి ఎలాంటి సమస్య రాకుండా శాశ్వతంగా నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు హరినాథ్ రెడ్డి, బండ్లమూడి వెంకటేశ్వరరావు, విజయసింహారెడ్డి , జడ్పిటిసి సభ్యుడు దుష్యంత్ రెడ్డి, విజయసింహారెడ్డి ,రాయపాటి గోవిందు ,మధు కృష్ణ ,తిమ్మారెడ్డి, రమేష్,జి ఎం రవి, గోపాలకృష్ణ, తెలుగుదేశం కార్యకర్తలు సిబిఎన్ ఆర్మీ సభ్యులు లింగేశ్వర్ గౌడ్ , షాహిన్ షా, వీరేష్ పాల్గొన్నారు