చంద్రబాబు వస్తే అబద్ధాల పాలనే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు వస్తే అబద్ధాల పాలనే

బుగ్గన
బేతంచెర్ల, ఏప్రిల్ 03(way2newstv.com
చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కరువు,అబద్ధాల పాలనే ఉంటుందే తప్ప, ఎక్కడా ప్రజా సంక్షేమం పట్టని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వైసీపీ డోన్ ఎమ్మెల్యే అభ్యర్థి  బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. సాధారణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని ముద్దవరం, ముసలాయి చెరువు, మర్రికుంట, సీతారామపురం,  సంకలపురం బైనపల్లె తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  పర్యటించి ప్రజలను వైకాపాకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. 


చంద్రబాబు వస్తే అబద్ధాల పాలనే

ముద్దవరం గ్రామంలోజరిగిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం భూ కబ్జాలు, అవినీతే పరమావధిగా పాలన కొనసాగిస్తూ ప్రజలను నట్టేట ముంచి మళ్ళీ ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు వస్తే ఎన్నడూ వర్షాలు పడక కరువు కాటకాలే తాండవిస్తూ, రైతులను నట్టేట ముంచుతున్న చంద్రబాబుకు బై బై చంద్రబాబు అని  చెప్పాలని ఆయన హితవు పలికారు. అంతే గాక తమ ప్రభుత్వం వస్తే అవినీతి రహిత పాలన అందించడంతో పాటు పోలీస్, రెవెన్యూ కార్యాలయాల్లో  తమ పనులకు ఎటువంటి దళారులు లేకుండా నేరుగా ప్రజలే వెళ్లి చేసుకునేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సి.హెచ్.లక్ష్మీ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మునేశ్వర రెడ్డి, రామచంద్రుడు, చంద్రమౌళి, కుమార్ రెడ్డి, గూని నాగరాజు, మహేశ్వర రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నారాయణ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మురళిధర రెడ్డి, బజాజ్ రామిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, గోపాల్, బాల స్వామి, రమేష్ రెడ్డి  వివిధ గ్రామాల  నాయకులు,కార్యకర్తలతో పాటు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.