అదృష్టవశాత్తు తప్పిన ప్రాణాపాయం
ఎమ్మిగనూరు ఏప్రిల్ 24 (way2newstv.com)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లారీ బీభత్సం సృష్టించింది. నేషనల్ హైవే పక్కన ఉన్న ఓ దుకాణంలోకి లారీ దూసుకెళ్లింది. ఏపీ 21 టి జెడ్ 4499 నెంబర్ గల లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో లారీ అదుపు తప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన ఘటన పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ జాతీయ రహదారిపై బుదవారం అర్ధరాత్రి జరిగింది.
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
మంత్రాలయం వైపు నుంచి లోడుతో వెళ్తున్న లారీ ఎమ్మిగనూరుకి రాగానే అన్నమయ్య సర్కిల్ కర్నూలు వైపు మలుపు వద్ద డ్రైవర్ కునుకు వేయడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమయ్యేలోగా ఇంటి ముందు భాగమంతా పూర్తిగా దెబ్బతింది. ఇంటి ముందు భాగంలో ఎవరూ నిద్రించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిర్లక్ష్యమైన డ్రైవింగే ఇందుకు కారణమని సంఘటనను చూస్తే తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం కలగలేదు. దీనికి సంబంధించిన కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణజరుపుతున్నారు.