బెంగళూర్ లో జీతాలు ఎక్కువ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెంగళూర్ లో జీతాలు ఎక్కువ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 (way2newstv.com
ఎవరైనా అధిక వేతనం లభించే ఉద్యోగాన్ని కోరుకుంటారు. అయితే అన్ని చోట్ల ఒకే రకమైన జీతం లభించదు. నగరం ప్రాతిపదికన వేతనం మారుతూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ జీతం వస్తుందో.. అక్కడికే ఉద్యోగుల ఉపాధి కోసం వెళ్తుంటారు. మన దేశంలో ఎక్కువ వేతనం అందించే నగరం బెంగళూరు. వేతనాల్లో బెంగుళూరు భేష్ అని తేలింది. ఈ నగరంలో ఉద్యోగులు సగటున ఏడాదికి ఉద్యోగులు 10.8 లక్షల జీతం (సీటీసీ) తీసుకుంటున్నారు. 


బెంగళూర్ లో జీతాలు ఎక్కువ 

రాండ్‌స్టాండ్ ఇన్‌సైట్స్ తాజా నివేదిక ప్రకారం.. బెంగళూరు హైయెస్ట్ పేయింగ్ సిటీగా అవతరించింది. దీని తర్వాతి స్థానంలో పూణే ఉంది. ఇక్కడ ఉద్యోగుల రూ.10.3 లక్షల వేతనం అందుకుంటున్నారు. ఇక దీని తర్వాతి స్థానం ఢిల్లీది. ఇక్కడి ఉద్యోగులు రూ.9.9 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఇక ఈ మూడు నగరాల తర్వాతి స్థానంలో ముంబై ఉంది. ఇ్కడి ఉద్యోగులు రరూ.9.2 లక్షల వేతనం అందుకుంటున్నారు. చివరిలో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా ఉన్నాయి.హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లోని ఉద్యోగులకు ఎక్కువ వేతనం లభిస్తోంది. కన్సూమర్ గూడ్స్, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. 6 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న వారు ఎక్కువ వేతనాలను అందుకుంటున్నారు.