హైదరాబాద్, ఏప్రిల్ 29 (way2newstv.com)
ఇంటర్ బోర్డ్ తప్పుల వల్ల విద్యార్థులు నష్ట పోయారంటూ సోమవారం ఉదయం ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతిభవన్ దగ్గర ఆందోళనకు దిగారు.
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత..
ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేసిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసారు. దాదాపు వందమందిని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా జరిగిన తోపులాటలో 10 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. నిరసన వ్యక్తం చేయడానికి వస్తే అరెస్ట్ చేయడం సరైంది కాదంటూ విద్యార్ది సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.