కర్నూలు, ఏప్రిల్ 8 (way2newstv.com)
బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల లో వైస్సార్సీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడం స్థానికంగా ఉద్రికత్త కు దారి తీసింది. సోమవారం మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల పై వైస్సార్సీపీ నాయకుల దాడి చేసారంటూ వార్తలు రావడంతో అక్కడికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
కొలిమిగుండ్లలో ఉద్రిక్తత
కొలిమిగుండ్ల లో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిది రోడ్ షో ఉండటంతో కార్యకర్తలు ఉత్సాహంగా రోడ్డుపై వస్తుండడంతో వైసిపి కార్యకర్తలు అక్కడే ఉండడంతో తో ఒక్కసారిగా ఇరు పార్టీల వారు ఎదురు పడ్డారు. ఈ నేపధ్యంలో కర్రలు విసురుకున్నారు. అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఇరువురిని చెదర కొట్టారు. అల్లర్లను దృష్టిలో ఉంచుకొని కోయిలకుంట్ల లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. వైకాపా కార్యకర్తలపై ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఫిర్యాదు చేసారు.