హైదరాబాద్ ఏప్రిల్ 29 (way2newstv.com)
కేంద్ర పన్నుల్లో వాటా మరియు అధికార వికేంద్రీకరణ ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన ఫోకస్‌గా ఉంటుందని, దీని ద్వారానే రాష్ట్రాలు బలోపేతమవుతాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో రానున్నది కచ్చితంగా హంగ్ పార్లమెంటేనని ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే మెజారిటీ రాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రాలు బలోపేతం : కేటీఆర్
ట్విట్టర్లో నెటిజన్లతో ఆయన సంభాషించారు. తమ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 16స్థానాలకు16 స్థానాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతోనే దేశంలో ఉద్యోగిత సంపద సృష్టి జరుగుతుందని, ఉత్తమ ఆర్థిక విధానాలే పార్టీల మేనిఫెస్టోల్లో ఉండాలని అన్నారు.రాబోయే కేంద్ర ప్రభుత్వమైనా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. గత ఎన్డీయే ప్రభుత్వం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ నెట్‌వర్క్ విషయంలో తెలంగాణకి తీవ్ర అన్యాయం చేసిందని, వచ్చే ప్రభుత్వమైనా అన్యాయాన్ని సరిదిద్దుతుందని కేటీఆర్ ట్విట్టర్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు.