మహబూబ్ నగర్, ఏప్రిల్ 27, (way2newstv.com)
మహబూబ్ నగర్ లో శనివారం జరిగిన టీఆరెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలలో అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గోన్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని అయన జిల్లా కేంద్రంలో టీఆరెస్ పార్టీ జెండా ను ఎగురవేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం అవుదాం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఒక్కడిగా పార్టీని స్థాపించి, తెలంగాణ రాష్ట్రం ను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కానుకగా అందచేశారన్నారు. కేసీఆర్ రాష్ట్రం లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను పేరు మార్చి ప్రవేశపెడుతున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి రూ.10 వేల కోట్లతో పనులను ఎన్నికల కోడ్ అనంతరం ప్రారంభిప్తామని మంత్రి అన్నారు. పాలమూరు రంగారెడ్డి తో మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి అన్నారు.