హస్తినలో త్రిముఖ పోటీలో గెలిచేదెవరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హస్తినలో త్రిముఖ పోటీలో గెలిచేదెవరు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30, (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల్లో, దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతున్నది. ప్రధానంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాల్లోనూ బీజేపీ క్లిన్ స్వీప్ చేసింది. కానీ, తరువాత జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం ప్రజలు మొత్తం 60 శాసన సభ స్థానాలకుగాను 57 స్థానాలను ఆప్‌కు కట్టబెట్టారు. ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీ చేయాలనే దిశగా చర్చలు జరిపాయి. చివరి వరకూ అదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అందరీ అంచానాలకు భిన్నంగా ఈ రెండు పార్టీలు ఢిల్లీలో వేర్వుగా పోటీకి సద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ తప్పడం లేదు. భిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనమైన ఢిల్లీలో కులాల వారీగా చూస్తే, ఇక్కడ ప్రధానంగా బ్రాహ్మణులు, వైశ్యులు (బనియా, కొమట్లు)దే అన్ని పార్టీల్లోనూ అధిపత్యం కొనసాగుతున్నది. రాజకీయ పదవులు దక్కించుకోవడంలోనూ వారే ముందు ఉన్నారు. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ రెండు వర్గాలకే అధిక ప్రధాన్యం ఇస్తున్నాయి. ఈ సారి కూడా వారికే ఎక్కువ శాతం సీట్లను కేటాయించాయి. 


హస్తినలో త్రిముఖ పోటీలో గెలిచేదెవరు 

ఇలావుంటే, కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మాజీ మంత్రి అజయ్ మాకెన్, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్, ఆపార్టీ సీనియర్ నాయకులు అర్విందర్ సింగ్ లలీ, రాజేష్ లిలోఠియా, జేపీ అగర్వాల్, మహాబల్ మిశ్రాలను బారీలోకి దింపింది. మరోక వైపుమెజారిటి స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థులనే మళ్లీ ప్రకటించింది. కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్ చాందినీచౌక్ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా, ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్‌ను తూర్పు ఢిల్లీ నుంచి బారీలోకి బీజేపీ దింపింది. అలాగే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మీనాక్షి లేఖి, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ, పర్వేష్ వర్మ,రమేష్ బిధూడి మళ్లీ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అలాగే ఢిల్లీలో ఏకైక ఎస్సీ రిజర్వేడు సీటైనా వాయవ్య ఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్‌ను పక్కనబెట్టిన బీజేపీ ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్‌హన్స్‌ను చివరి నిమిషంలో ఆ స్థానం నుంచి బారీలోకి దిపింది. మరోకవైపు ఆప్ పార్టీ నుంచి ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటి చేస్తున్నవారంతా మొదటి సారి ఎన్నికల్లో పోటి చేస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ఆప్ నుంచి బ్రిజేష్ గోయల్, అతిషి, గూగన్ సింగ్, దిలీప్ పాండే, రాఘవ్ చద్దా, పంకజ్ గుప్తా, బల్జీర్ సింగ్ ఝాకడ్‌లు పోటీ చేస్తున్నారు. బీజేపీ ముగ్గరు సెలెబ్రిటీలను బారీలోకి దింపింది. 2014లో ఈశాన్య ఢిల్లీ నుంచి ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీకి బారీలోకి దింపగా ఆయన విజయం సాధించారు. అదే స్థానం నుంచి ఆయన్ని మళ్లీ రంగలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్‌ను వాయువ్య ఢిల్లీ నుంచి రంగంలోకి దింపగా, తూర్పు ఢిల్లీ నుంచి క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను బరీలోకి దింపింది. 2013 వరకు ఢిల్లీలో తీరుగులేకుండా ఆధిపత్యం చెలాయించి, ఆతర్వాత లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయినా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపడుకునే పనిలో పండింది. ప్రధానంగా ఆప్ ఢిల్లీలో అడుగుపెట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీకి కష్టలు మొదలయ్యాయి. ఈఎన్నికల్లో సీనియర్ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్, పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ మాకేన్‌పై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు పోత్తు పెట్టుకుంటే బీజేపీ ఢిల్లీలో కష్టలు తప్పవని విశే్లషకులు భావించారు. కానీ, ఢిల్లీలో మూడు ప్రధాన పార్టీలు బారీలో ఉండటం వల్ల త్రిముఖ పోరు ఖాయం అయింది. ఈ సారి బీజేపీ గత వైభావాన్ని కోనసాగిస్తుందో లేదో చూడాలి. ఆప్ ఢిల్లీలో శాసన సభ గెలిచుకున్న విధంగా ఈసారి ఎంతవరకు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకుంటుందో చూడాల్సి వుంది.