శాటిలైట్ సాయంతో ఆస్తుల డేటా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శాటిలైట్ సాయంతో ఆస్తుల డేటా

హైద్రాబాద్, ఏప్రిల్ 25, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రంలోని 73 పురపాలక సంఘాల్లో శాటిలైట్ సహాయంతో ఆస్తుల డేటాను సంకలనం చేసి ఒక సమగ్ర ప్రాజెక్టును తయారు చేయడం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. దేశంలోనే తొలిసారిగా పురపాలక శాఖ వినూత్న రీతిలో పురపాలక సంఘాల్లో ఆస్తుల మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్రం ఆధీనంలోని పరిపాలన సంస్కరణల విభాగం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ నూతన విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం శాటిలైట్ ఆధారంతో ఆస్తుల అనుసంధానం డేటాతో ప్రాజెక్టుకు సంబంధించి ఒక పుస్తకాన్ని రూపొందించింది. 


శాటిలైట్ సాయంతో ఆస్తుల డేటా 

ఇందులో అత్యుత్తమ నాణ్యమైన ఫొటోలను ప్రచురించింది. గతంలో పురపాలక సంఘాల్లో ఆస్తుల రికార్డులు సరిగా ఉండేవి కావు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పురపాలక పరిపాలన శాఖ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తుల వివరాలను సేకరించింది. వీటిని డిజిటలైజేషన్ చేశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇన్‌ఫర్మేషన్ సహాయంతో మున్సిపల్ పరిధిలోని ఆస్తులను జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రంలో 12.5 లక్షల ఆస్తులను శాటిలైట్ మ్యాపింగ్ చేశారు. 20,100 ఆస్తుల నుంచి అదనంగా రూ.31 కోట్ల ఆస్తి పన్ను రాబట్టినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. జియోట్యాగ్ చేసి ఆస్తులను పన్ను పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2015-16లో 85.56 శాతం అంటే రూ.243 కోట్లు, 2016-17లో రూ.284 కోట్లు,2017-18లో రూ.328 కోట్ల మేర పన్నులను పురపాలక శాఖ వసూలు చేసింది. రాష్ట్రంలో 770 మంది బిల్ కలెక్టర్లకు జియోట్యాగింగ్‌పై శిక్షణ ఇచ్చారు