సెక్టోరియల్ అధికారులే కీలకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సెక్టోరియల్ అధికారులే కీలకం

నల్గగొండ, ఏప్రిల్ 9, (way2newstv.com)
పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లను పోలింగ్ కేంద్రాల్లో సమకూర్చి విద్యుత్, తాగునీరు, వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన కీలక బాధ్యత సెక్టోరియల్ అధికారులపై ఉందని ఆదిలాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్య అన్నారు. బుధవారం లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారుల పాత్ర, వారి విధి విధానాలపై దివ్య సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రతి పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నెంబర్లు వేసి విద్యుత్ సరఫరా సమకూర్చాలన్నారు.నీటి సరఫరా లేకపోతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. నిర్ణీత ప్రొఫార్మలో పోలింగ్ కేంద్రాల సమస్యల గురించి తనకు వెంటనే నివేదించాలని సూచించారు. 


సెక్టోరియల్ అధికారులే కీలకం

ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో గతంలో జరిగిన సంఘటనలు, బైండోవర్ వివరాలను స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని వౌలిక సదుపాయాల ప్రో ఫార్మతో పాటు ఫోటోలు సేకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం, వీవీ ప్యాడ్, బ్యాలెట్ సామాగ్రి, కంట్రోల్ యూనిట్లకు సంబంధించి పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేలా సెక్టోరియల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలపై సిబ్బంది క్షేత్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు.వేసవి కాలంలో అనేక సమస్యలు వెంటాడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో నెంబరింగ్ జరిగిందా లేదా అన్న విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించుకోవాలన్నారు