నాగ శౌర్యకు కలిసిరాని కాలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాగ శౌర్యకు కలిసిరాని కాలం

హైద్రాబాద్, ఏప్రిల్ 9, (way2newstv.com)
ఊహలు గుసగుసలాడే’ సినిమాతో సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగశౌర్య. ఆ తరవాత ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘జ్యో అచ్యుతానంద’, ‘ఛలో’ సినిమాలతో తన ఇమేజ్‌ను పెంచుకున్నాడు. వరసపెట్టి సినిమాలను అంగీకరించాడు. అయితే, వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాగశౌర్య ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పటికే వరుస పరాజయాలతో ఢీలా పడిన నాగశౌర్యకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నాగశౌర్య అంగీకరించిన ఒక్కో సినిమా తన చేతుల్లో నుంచి జారిపోతోంది. 


నాగ శౌర్యకు కలిసిరాని కాలం

ఇప్పటికే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. తాజాగా మరో సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నాగశౌర్య హీరోగా ఆనంద్ ప్రసాద్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ కిందటేడాది ఒక సినిమాను ప్రారంభించింది. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాత. కూకట్‌పల్లిలోని ఓ ఆలయంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఓ బేబీ’ సినిమాలో నాగశౌర్య నటిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉంది. ఇది కాకుండా అవసరాల శ్రీనివాస్‌తో మరో సినిమాను నాగశౌర్య చేయబోతున్నారు.